Cm kiran visits flood hit srikakulam district

Andhra Pradesh, Chief Minister, N. Kiran Kumar Reddy, aerial survey, cyclone-hit, Srikakulam district, cyclone Phailin

Chief Minister N. Kiran Kumar Reddy Sunday made an aerial survey of cyclone-hit Srikakulam district.

తుఫాన్ బాధితులకు కిరణ్ వరాలు

Posted: 10/20/2013 04:59 PM IST
Cm kiran visits flood hit srikakulam district

‘దొంగలు పడిన ఆర్నెళ్ళ తరువాత...కుక్కలు మొరిగినట్లు ’ గత వారం కోస్తాలో వచ్చిన ఫైలిన్ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఫైలిన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని వారిని ఇవాళ కలిసిన ఆయన వారి పై 40 కోట్ల వరాల జల్లు కురిపించారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పంటలను, అక్కడి మత్స్యకారులను పరామర్శించిన ఆయన ఇచ్చాపురం మండలంలో డొంకూరులో మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.

మత్స్యకారుల గ్రామాలకు రూ. 40 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు కోటి రూపాయలు, కనీస సదుపాయాలకు రూ. 15 లక్షలు, డొంకూరు డ్వాక్రా మహిళా సంఘానికి రూ 10 లక్షల విలువ చేసే రెండు వాహనాలు మంజూరు చేస్తున్నట్లు కిరణ్ చెప్పాడు. ద్యార్థులకు వసతి గృహం కేటాయిస్తున్నట్లు, 30వేల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. తుపాన్ వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత వరకు ప్రభుత్వమే భరిస్తుందని సిఎం కిరణ్ చెప్పారు. తుపాన్ లో నష్టపోయిన రైతుల కొరకు ఎంత వీలుంటే అంత సహాయం చేస్తామని, బాధితులు తమ పేరును అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇక్కడ విలేఖర్లు రాష్ట్ర విభజన విషయాన్ని ప్రస్తావించగా ఇది సందర్భం కాదంటూనే తుఫాన్ ని ఆపలేక పోయినా... విభజనను మాత్రం ఆపుతానని అన్నారు. అయితే బాధితులను పరామర్శించడానికి వెల్లిన ఆయన విభజన గురించి మాట్లాడం పద్దతిగా లేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. మరి ఓట్ల కోసమే ఇన్ని వరాలు కురిపించాడా ? నిజంగానే వారిని ఆదుకోవడానికి చెప్పాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles