Digvijay singh say thanks to ap ngos to call off strike

Digvijay Singh Say Thanks to AP NGOs to Call off Strike, Digvijay Singh Say Thanks to AP NGOs

Digvijay Singh Say Thanks to AP NGOs to Call off Strike, Digvijay Singh Say Thanks to AP NGOs

ఏపీ ఎన్జీవోలకు థ్యాంక్స్ చెప్పిన సింగ్

Posted: 10/18/2013 11:57 AM IST
Digvijay singh say thanks to ap ngos to call off strike

ఎట్టకేలకు 75 రోజులు తరువాత.. సీమాంద్ర సమైక్య ఉద్యమానికి సెలవు చెప్పటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ ఎన్జీవోల జరిగిన చర్చల అనంతరం ఉద్యోగులు సమ్మెకు తత్కాలిక విరమరణ చేస్తున్నట్లు చెప్పటం జరిగింది. అయితే రాష్ట్ర విభజన పై ఎప్పటికప్పుడు వేగం పెంచుతున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ నుండి.. సీమాంద్రలో సమైక్యాంద్ర ఉద్యమం తీవ్రత తగ్గిందని మీడియా ముందు చెప్పటం జరిగింది. దీంతో తెలంగాణ ప్రక్రియను వేగం చేసుకోవటానికి సమయం వెసులుబాటు కలిగింది.

 

అయితే సమ్మె విరమించినందుకు ఏపీ ఎన్జీవో నేతలకు దిగ్విజయ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఇరు ప్రాంతాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు యూపీఏ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుందన్నారు. విభజన తర్వాత కూడా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సామరస్యం కొనసాగాలని దిగ్విజయ్ ఆకాంక్షించారు.

 

కాగా గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సీమాంధ్రలో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చక్కదిద్దుకుంటూ రావడంపట్ల కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏమైన ముఖ్యమంత్రి ఆద్వర్యంలో.. సమ్మె నీరుకారిపోవటం పై అనేక అనుమనాలకు దారితీస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles