Phailin cyclone made havoc

Phailin cyclone made havoc, Srikakulam hit by cyclone, Odisha hit by cyclone, IMD Chief Secretary Rathod, Phailan rescue teams

Phailin cyclone made havoc

ఉగ్రరూపం చూపించిన పెను తుఫాను ఫైలిన్

Posted: 10/13/2013 12:42 PM IST
Phailin cyclone made havoc

రాబోయే ప్రమాదాన్ని గమనించి ప్రాణ నష్టాన్ని ఎంతగానో తగ్గించుకోగలిగాం.  అందుకు భారత వాతావరణ శాఖను ప్రశంసించటమే కాకుండా, తగురీతిలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కొనియాడ వలసిందే.  కానీ పంటలు నష్టపోయాయి, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగింది.  వాటిని పూరించుకోవటానికి ఎంత కాలం పడుతుందో అంచనా వెయ్యటానికి ఇంకా సమయం రాలేదు.  

మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో భారీ నష్టం జరిగింది.  ఇంకా వర్షం, చల్లటి గాలులు వణికిస్తున్నాయి.  మీడియా కూడా సరైన సమయంలో సరైన రీతిలో స్పందించటం, ప్రజలను హెచ్చరించటంతో పాటుగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల చొరవ, అత్యవసర పరిస్థితిని గుర్తించి ఉద్యమాన్ని పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న ఉద్యోగులు కూడా శ్లాఘనీయులే.  

మొత్తానికి గండమైతే గడిచింది కానీ జరిగిన పంటనష్టం, రోడ్లు నిర్మాణాలు, సమాచార వ్యవస్థలకు కలిగిన నష్టం శ్రీకాకుళం ఒక్క జిల్లాకే పరిమితమయ్యేది కాదు.  దాని ప్రభావం రాష్ట్రమంతటిమీదా పడుతుంది.  

భారత వాతావరణ సంచాలకుడు రాథోడ్ ఈ సందర్భంలో మాట్లాడుతూ, హెచ్చరికలను సకాలంలోనూ కచ్చితమైన లెక్కలతో చెప్పటం వలన జననష్టాన్ని నివారించామని అన్నారు.  ప్రస్తుతం వీస్తున్న గాలులు చాలా బలహీనంగా ఉన్నాయని, ప్రమాదమైతే ప్రస్తుతం ఇంకేమీ లేదని అన్నారు. తుఫాన్ ప్రభావం కేవలం వర్షాలు కురిసేంతవరకే ఉంటుందని, ప్రస్తుతం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలే కాకుండా బెంగాల్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కూడా రాబోయే 24 గంటలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రాథోడ్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles