Mla kishan reddy comments on mim party

MLA kishan reddy comments on mim party, BJP leader Kishan Reddy, Kishan Reddy Fires on MIM Party, Kishan Reddy Sensational Comments on MIM party, BJP vs MIM party, kishan reddy, narendra modi,

MLA kishan reddy comments on mim party, Kishan Reddy Fires on MIM Party

పార్టీని ముస్లింలే మట్టికరిపిస్తారు : కిషన్ రెడ్డి

Posted: 10/08/2013 10:43 AM IST
Mla kishan reddy comments on mim party

ఒక రోజు వస్తుంది... ఆరోజు ముస్లిం మైనారిటీలు మజ్లిస్‌ పార్టీని మూసీలో కలపక తప్పదని' భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మజ్లిస్‌ పార్టీ నేతలు అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లు పాతబస్తీలో ఎంతమంది ముస్లిం మైనారిటీలకు ఉపాధి కల్పించారో చెప్పాలని సవాల్‌ విసిరారు. అలాగే తాను తన నియోజకవర్గంలో ఎంతమంది ముస్లింలకు ఉపాధి కల్పించానో, ఎన్ని సిమెంట్‌ రోడ్లు వేయించానో చెబుతానని వారు ముస్లింలకు కల్పించిన ఉపాధి, రోడ్లు, మంచినీటి సరఫరాకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ప్రశ్నించారు. వక్ఫ్‌ బోర్డు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పాతబస్తీలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా మీ పార్టీ వారే అయినా ఎందుకు అభివృద్ధి జరగలేదన్నారు. ఎంతసేపటికీ దాదాగిరి, భూ కబ్జాలు చేస్తూ మైనారిటీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.

 

 

దేశంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటించిన ఏకైక పార్టీ బిజేపి యేనన్నారు. తనను ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించమని మోడీ అడగలేదని, ప్రజలే సంవత్సరకాలంగా ఆయనను ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ దుష్టపాలన వలన ఈ పరిస్థితి దాపురించిందన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో ముస్లిం, క్రిష్టియన్ల అభివృద్ధికి ఎంతో కృషి జరిగిందని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెళతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles