Discuss bifurcation doubts with seemandhra ministers jaipal reddy

Discuss Bifurcation Doubts with Seemandhra Ministers Jaipal reddy Reddy, AP Bifurcation , Ministers Jaipal Reddy,

Discuss Bifurcation Doubts with Seemandhra Ministers Jaipal Reddy

హైదరాబాద్ తెలంగాణ పౌరుల సొంత సొత్తుకాదు: జైపాల్ రెడ్డి

Posted: 10/05/2013 06:36 PM IST
Discuss bifurcation doubts with seemandhra ministers jaipal reddy

రాష్ట్రం విడిపోయినంత మాత్రాన తెలుగుజాతి బలహీనపడదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. నగరంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో ఈరోజు ఆయన మాట్లాడారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవరసం లేదన్నారు. కేంద్ర మంత్రుల బృందంతో సీమాంధ్ర ప్రజలు వారి ఆందోళననను, అనుమానాలను గురించి చెప్పుకోవచ్చన్నారు. హైదరాబాద్ చారిత్రకంగా అన్ని బాషలు, ప్రాంతాలు వారు నివసించడంతో అంతర్జాతీయ నగరంగా మారిందని అన్నారు. హైదరాబాద్ తెలంగాణ పౌరుల సొంత సొత్తుకాదని, భారతదేశంలోని ప్రతీ పౌరునికి హైదరాబాద్ పై హక్కు ఉందని చెప్పారు. ఎపీఎన్జీవోలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవరసరం లేదన్నారు.

 

మంత్రుల బృందానికి సమస్యలన్నిటినీ తీర్చేందుకు ఇంకా ఆరు వారాల సమయం ఉందన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన తెలుగుజాతి, సంస్కృతి బలహీన పడుతుందనడంలో వాస్తవం లేదన్నారు. విభజనతో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య భావ సారూప్యత పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందన్నారు. ఇరు ప్రాంతాలలో సహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు సీమాంధ్ర నాయకులతో కలిసి చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రాష్ట్రం విడిపోయినంతమాత్రాన హైదరాబాద్ నగరం ఎక్కడకీ పోదని అన్నారు. తెలుగు ప్రజలు దేశమంతటా ఉన్నారని చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles