Manmohan singh to meet president pranab on ordinance

Rahul Gandhi,Prime Minister Manmohan Singh,President,PranabMukherjee,Ordinance,Ordinance on convicted lawmakers, Rahul Gandhi

PM Manmohan Singh will meet President Pranab Mukherjee on Wednesday ahead of the Cabinet meeting on the controversial Ordinance.

యువరాజు దెబ్బకు ఆగిన ఆర్డినెన్స్

Posted: 10/02/2013 09:26 AM IST
Manmohan singh to meet president pranab on ordinance

‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువా ’ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వం నేరచరితుల పై కేసులు, శిక్షల విషయంలో సత్వర చర్యలు ఉండకుండా కేంద్రం ఓ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ పై యువరాజు కన్నెర్ర జేసి, యూపీఏ ప్రబుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనదని, ఈ ఆర్డినెన్స్ ను చించి అవతల పారేయాలని యువనేత చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో ఓ కుదుపు కుదిపాయి. ఈ వ్యాఖ్యలతో ప్రధాన మంత్రి రాజీనామా చేస్తారనే వార్తలు కూడా షికార్లు చేశాయి.

కానీ ప్రధాన మంత్రి చాలా నెమ్మదస్తుడు కావడం వల్ల ఆవేశపడి రాజీనామా చేయకుండా, ఇటు రాహుల్ గాంధీ మాటను కూడా తీసిపారేయకుండా ఈ ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకునేందుకు సిద్ధం అవుతుంది కేంద్రం.  రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్ ఫైల్‌ పై విదేశీ పర్యటన ముగించుకుని రాత్రే మన్మోహన్ న్యూఢిల్లీకి చేరుకున్న ఈయన బుధవారం  కేబినెట్ భేటీ జరగడానికి ముందుగానే ఆయన రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి ప్రణబ్‌తో సమావేశమై ఈ ఆర్డినెన్స్ ను ప్రక్కన పెట్టాని కోరనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

ఈ ఆర్డినెన్స్ కు సంబంధించి సొంత పార్టీ నుండి,  ప్రతిపక్షాల నుండి విమర్శలు రావడంతో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోతుంది. మొత్తానికి యువరాజు ఒక్కబాంబు పేల్చితేనే కేంద్రం ఇలా కిందా మీద పడి గింగిరాలు తిరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles