Man shot at for not putting onions in omelette

Man shot at for not putting onions in omelette, Uttar Pradesh, egg omelette, gg vendor Deepu Kashyap, Ashutosh Pandey

Man shot at for not putting onions in omelette

ఉల్లిపాయ ముక్కలు కోసం మర్డర్

Posted: 09/24/2013 12:30 PM IST
Man shot at for not putting onions in omelette

ఉల్లిపాయను చూచి యాపిల్ పండు సిగ్గుపడుతుంది. రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతుంది. యాపిల్ పండు రేటు మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుంది. రెండు ఇంచుమించు ఒకే రంగులో ఉన్నప్పటికి.. ఉల్లిని చూచి ప్రజలు భయపడుతున్నారు. కాదు.. కాదు ఉల్లి ముక్కలు కోసం మర్డర్లు జరిగే స్థాయికి ఉల్లి వెళ్లిపోయింది. ఉల్లిలేకుండా మనిషికి ..ముద్ద తిగదు. ఉల్లిలేనిదే రుచి లేదు. ఉప్పు లేకపోయిన తినే వారు ఉన్నారు కానీ, ఉల్లి లేకుండా బ్రతకటం చాలా కష్టమని ప్రజలు అంటున్నారు. అయితే రీసెంట్ గా ఉల్లి ముక్కలు కోసం ఉత్తరప్రదేశ్ లో ఒక హత్య జరిగింది.

ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదని ఓ వ్యక్తి ఓ చిరు వ్యాపారిని కాల్చి పారేశాడు. ఈ సంఘటన ఇటా ప్రాంతంలోని అలీగంజ్ సమీపంలో జరిగింది. పూజారి అనేవ్యక్తి పాత నేరస్థుడు. అతడు తనతో పాటు నలుగురు స్నేహితులకు ఆమ్లెట్లు కావాలని ఓ చిరు వ్యాపారి వద్ద ఆర్డర్ చేశాడు. అతడు ఆమ్లెట్లయితే ఇచ్చాడు గానీ, వాటిలో ఉల్లిపాయలు వేలేదు. దీంతో వారందరికీ ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఉల్లిపాయలు కొనేంత స్థోమత తనకు లేదని, అందువల్లనే ఉత్త ఆమ్లెట్లు ఇస్తున్నానని దీపు కశ్యప్ అనే సదరు చిరు వ్యాపారి వారికి చెప్పాడు. వెంటనే పూజారి జేబులోంచి తుపాకి తీసి.. అతడిని కాల్చిపారేశాడు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని, వారి కోసం గాలిస్తున్నామని ఐజీపీ అశుతోష్ పాండే తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles