Samaikyandhra movement effects in tamilnadu

samaikyandhra movement effects in tamilnadu, Samaikyandhra Movement Effect , telugu ganga, telugu people, seemandhra sega effects in tamilnadu,

samaikyandhra movement effects in tamilnadu

తమిళనాడుకు అడ్డుకున్న సమైక్య సెగ

Posted: 09/20/2013 05:52 PM IST
Samaikyandhra movement effects in tamilnadu

52 రోజుల నుండి సీమాంద్రలో సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. సమైక్యాంద్ర వాదులు సీమాంద్ర రాజకీయ నాయకులపై ఒత్తిడి పెంచారు. అంతేకాకుండా సమైక్యాంద్ర వాదులు ఉద్యమ తీవ్రస్థాయిని పెంచుతున్నారు. అయితే ఈరోజు తమిళనాట కూడా సమైక్యవాదులు ఆందోళన బాట పట్టారు. తొట్టంబేడు తెలుగు గంగ కాలువ వద్ద సమ్యైక ఆందోళనకారులు నిరసన తెలిపారు. తమిళనాడుకు తెలుగు గంగ జలాలు వెళ్లకుండా అడ్డుకట్టవేశారు. ఇప్పటికే తీ్వ్రస్థాయిలో ఉద్యమిస్తున్న సీమాంధ్రులు తమ పంథాను మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. నేతలను అడ్డుకుంటూ తమ నిరనన గళం వినిపిస్తున్న సమైక్యవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. సమైక్యోద్యమం అధికార పార్టీ నేతలకు వణుకు పుట్టిస్తోంది. సీమాంధ్రలో నేతలను సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పదవులను పట్టుకుని ఇంకెంతకాలం వేలాడతారంటూ నిలదీస్తున్నారు. తక్షణం రాజీనామాలు ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలంటూ అల్టిమేటం ఇస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles