Film producer thammareddy krishnamurthy dies

film producer thammareddy, Thammareddy Bharadwaja, Thammareddy Krishnamuthy Raghupati Venkaiah Naidu Award, Ravindra Art pictures Thammareddy Krishnamurthy krishnamurthy dies

film producer thammareddy krishnamurthy dies

సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత

Posted: 09/16/2013 12:13 PM IST
Film producer thammareddy krishnamurthy dies

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఈరోజు మృతి చెందారు.  ఆయన వయసు 94 సంవత్సరాలు.  వృద్ధాశ్రమంలో ఉంటున్న కృష్ణమూర్తి ఆ కాలంలో నిర్మించిన సినిమాలు - జమీందార్, లక్షాధికారి, బంగారు గాజులు, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు మొదలైనవి. 

తమ్మారెడ్డి కృష్ణమూర్తి కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా సినీ నిర్మతగా పనిచేసారు. 

కృష్ణాజిల్లాలో జన్మించిన కృష్ణమూర్తి స్వాతంత్ర సమరపోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.  ప్రజా నాట్యమండలిలో పనిచేసారు.  2007 లో రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని అందుకున్న కృష్ణమూర్తి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకం మీద చిత్రాలను నిర్మించేవారు. 

కృష్ణమూర్తి అంత్య క్రియలు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సనత్ నగర్ స్మశానవాటికలో చేస్తారు.  అప్పటి వరకు ఆయనకు కావలసినవారి చివరి చూపు కోసం వృద్ధాశ్రమం నుంచి తీసుకుని వచ్చి నాగార్జున సాగర్ నివాసంలో ఉంచారు.  తెలుగు సినీ ప్రముఖులు పలువురు ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles