Apngo save andhra pradesh public meet

APNGO Save Andhra Pradesh public meet

APNGO Save Andhra Pradesh public meet

సభను అడ్డుకోవటానికి అన్ని ప్రయత్నాలు

Posted: 09/06/2013 03:04 PM IST
Apngo save andhra pradesh public meet

ఎపి ఎన్జీవోలు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు హైద్రాబాద్ ఎల్ బి స్టేడియంలో సభ జరుపుకోవటానికి పోలీసులు అనుమతిచ్చినా, ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని తెలంగాణా ఉద్యమకారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుండటంతో హైద్రాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది.

సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో జరుపనున్న సభను నిలిపివేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ వీగిపోయింది.  అయితే మరో అస్త్రంగా సభ ప్రత్యక్ష ప్రసారాలను అనుమతించ వద్దంటూ మరో పిటిషన్ దాఖలైంది.  ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదుల మానవహారాన్ని తెలంగాణా న్యాయవాదులు అడ్డుకోవటంతో హైకోర్టు దగ్గర తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది.  పోలీసులు కలుగజేసుకుని విడదీయగా సీమాంధ్ర న్యాయవాదులు కోర్టు బయట మానవహారాన్ని నిర్వహించేందుకు పూనుకోగా పోలీసులు 20 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసారు. 

అరెస్ట్ చేసిన న్యాయవాదులను వెంటనే విడుదల చెయ్యాలని, దాడి చేసిన న్యాయవాదులను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి న్యాయవాదులు విధులు బహిష్కరించి గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఆందోళన సాగించటంతో ట్రాఫిక్ చాలా దూరం వరకు ఆగిపోయింది.

ఈలోపులో సెంట్రల్ జోన్ డిసిపి కమలహాసన్ రెడ్డి ఎల్ బి స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించారు.  ఐడి కార్డులున్నవారిని మాత్రమే స్టేడియంలోపలకు అనుమతించటం జరుగుతుందని ఏపి ఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు మరోసారి అందరికీ గుర్తు చేసారు.  నినాదాలు, బ్యానర్లు లేకుండా సభకు రావాలని, రసాభాసు చెయ్యటానికి రెచ్చగొట్టే ప్రయత్నాలు తప్పక జరుగుతాయని, కానీ అందరూ సంయమనాన్ని పాటించాలని అర్థించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles