Ys sharmila fire on congress party in tirupati bus yatra

ys sharmila fire on congress party in tirupati bus yatra, Samaikhya Shankaravam bus yatra, YS Sharmila to Begin Bus Yatra, Samaikhya Shankaravam, bus yatra started from Tirupati, ysr congress party, ysrcp, sharmila shankaravam

ys sharmila fire on congress party in tirupati bus yatra

వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ

Posted: 09/03/2013 11:28 AM IST
Ys sharmila fire on congress party in tirupati bus yatra

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ పార్టీ సమన్యాయం చేసే పరిస్థితి కనిపించడంలేదని, ఆ నమ్మకం కూడా తమకు లేదనీ అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. దీనికి అనుగుణంగానే సమైక్య శంఖారావాన్ని పూరించినట్లు ఆమె తెలిపారు. తిరుపతిలో జరిగిన సమైక్య శంఖారావం తొలి బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ, ఏ కోణంలో చూసినా సమన్యాయం చేసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికీ రాష్ట్ర విభజన నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదని పదే పదే చెబుతున్న మాటలు చూస్తుంటే అందరికీ న్యాయం జరిగే ఆనవాళ్లు ఆమడ దూరంలో కూడా కనిపించడం లేదన్నారు. నాలుగేళ్ళ కిందట అన్నపూర్ణలా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్‌ మరణం తరువాత నాలుగేళ్ళలోనే కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పెద్దలు అడ్డుగోలుగా విభజన చేయడానికి నిర్ణయించారన్నారు. తెలుగువారి భిక్షతో గద్దెనెక్కిన ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని చీల్చి వెన్నుపోటు పొడించిందని ఆరోపించారు. ఇక 60 ఏళ్ళుగా కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ ఒకే ప్రాంతానికి పరిమితమైతే అలాంటి నగరాన్ని నిర్మించుకోవడానికి తరాలు పడుతుందన్నారు. అంతవరకూ విద్యార్థుల, నిరుద్యోగుల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు. భౌగోళికంగా తెలంగాణలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసినా పొరుగు రాష్ట్రంలో రాజధాని ఉన్నట్లే అవుతుందన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles