17 years boy who threatened kcr held in nellore

17 years boy who threatened kcr held in nellore, kcr, trs leaders, andhra pradesh,

17 years boy who threatened kcr held in nellore

కేసిఆర్ ను చంపేస్తానన్న కావలి కుర్రోడు

Posted: 08/30/2013 03:54 PM IST
17 years boy who threatened kcr held in nellore

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గత కొద్ది రోజులగా బెదిరింపుకాల్స్ , ప్రాణాహనీ ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు, ఈటెల రాజేంద్ర మీడియా ముందు గోల చేసిన విషయం తెలిసిందే. కేసిఆర్ కు పోలీసు రక్షణ కావాలని డిజీపి కి చెప్పటం జరిగింది. రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగిన తరువాత ఇలాంటావి రావటంతో ప్రభుత్వం కూడా స్పందించి కేసిఆర్ కు జెడ్ ప్లస్ కాటగిరి భద్రత ఏర్పాటు చేసింది. అయితే ఇంతకీ కేసిఆర్ కు డెత్ లైన్ పెట్టింది ఎవరు? ఎక్కడ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి? అనే దానిపై పోలీసులు నిఘా పెంచారు. పోలీసులు పెట్టిన నిఘాలో 17 ఏళ్ల కుర్రోడు దొరికిపోయాడు. కేసిఆర్ ను చంపెస్తానన్న అతనిది నెల్లూరుజిల్లా కు చెందిన కావలి కుర్రోడుగా పోలీసులు నిర్థారించారు. గతంలో ఈ కావలి కుర్రోడు మంత్రి ఆనం రామనారాణ రెడ్డిని బెదిరించినట్టు సమాచారం. ఫోన్ చేసి అమ్మాయిలను వేధిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసీఆర్ ను చంపేస్తామంటూ టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ కు కొద్ది రోజుల క్రితం ఒక బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఎర్ర స్కెచ్ పెన్నుతో రాసిన ఈ లేఖలో కేసీఆర్ ను కాల్చి చంపేస్తామంటూ హెచ్చరించారు. ‘కేసీఆర్.. యూ విల్ బి షాట్‌డెడ్ విత్ ఇన్ 10 డేస్ ( కేసీఆర్.. పది రోజుల్లో నిన్ను కాల్చి చంపుతాం) అని ఎరుపు రంగు స్కెచ్‌పెన్‌తో రాశారు. ఆ లేఖ ప్రతులను మీడియాకు కూడా టీఆర్ఎస్ విడుదల చేసింది. అయితే ఈ కుర్రోడోకి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని పోలీసులు అంటున్నారు. అందువలనే ఇలాంటి పనులు చేస్తుంటాడని.. అతని బందువులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles