Ys jaganmohan reddy shifted to osmania hospital

YS Jaganmohan reddy shifted to Osmania hospital, YS Jagan Healh Worsens Shifted to Osmania Hospital, ambulance accident in jail, Jagan Continuing Deeksha in Osmania

YS Jaganmohan reddy shifted to Osmania hospital, YS Jagan Healh Worsens Shifted to Osmania Hospital

జగన్ ను తరలింపు-ప్రమాదంలో అంబులెన్స్

Posted: 08/30/2013 09:59 AM IST
Ys jaganmohan reddy shifted to osmania hospital

చంచల్ గూడ జైల్లో వైకాపా అధినేత జగన్ చేపట్టిన దీక్షను జైలు అధికారులు అర్థరాత్రి భగ్నం చేశారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆద్వర్యంలో భారీ భద్రత మద్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వీల్ చైర్ ఏర్పాటు చేయగా తిరస్కరించి వాహనం దిగి నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లారు. క్యాజువాలిటీలో బీపీ, షుగర్ స్థాయిలను పరీక్షించి అత్యవసర వార్డులోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని జైలు వైద్యులు తెలిపారని, ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆసుపత్రికి తరలించామని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని ఉదయం నుంచి చెబుతు్న నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిని కేంద్ర స్థానిక పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. లోపలకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను గుర్తింపు కార్డులు చూసి మరీ కొంత దూరం వరకే అనుమతించారు. జగన్ రాకకు రెండు గంటల ముందే వైద్యాధికారులు ప్రత్యేక ఏసీ గదిని సిద్దం చేశారు. వైద్య నిఫుణులను, చికిత్సకు అవసరమైన సెలైన్లను సమకూర్చారు.

 

ప్రమాదంలో అంబులెన్స్

జగన్ ను తరలించే సమయంలో జైలు ప్రాంగణంలో అంబులెన్స్ వాహనం చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో జైలు సూపరింటెండెంట్ డ్రైవర్ , దాస్, డిప్యూటి సూపరింటెండెంట్ వద్ద పనిచేసే పైలట్ గోవిందరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వాంతో వారిని మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జగన్ ను ఉస్మానియాకు తరలించే విషయంలో కొంత ఆలస్యమైంది. వాహనం బ్రేక్ ఫెయిల్ అయిన అంబులెన్స్ ప్రమాదానికి గురైనట్లు జైలు అధికారులు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles