Car ruining in banjara hills

car ruining in banjara hills, Banjara Hills, Hyderabad, young girl car driving, traffic police,

car ruining in banjara hills

కారుతో భీభత్సం స్రుష్టించిన యువతి

Posted: 08/24/2013 12:12 PM IST
Car ruining in banjara hills

బంజారాహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఒక యువతి తన కారుతో వేగంగా దూసుకొచ్చి విద్వంసం స్రుష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ స్టేషన్ సమీపంలో రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎ.పి.09సీఎన్ 6189 నెంబరు కారులో యువతి వేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను గుద్దుకుంటూ వెళ్లి ఎదురుగా ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కూడా యువతి వాహనం ఆపకుండా అదే వేగంతో కారును ముందుకు నడపడంతో కారు వెనుకటైరు ద్విచక్రవాహనదారుడిపై నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో పక్కసీటులో ఆమె సహచరుడు, వెనుక సీటులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. మద్యం సేవించి కారు నడుపుతున్న వాహనదారుడు తనిఖీలు చేస్తున్న పోలీసులను ముందే గమనించి, యువతికి డ్రైవింగ్ అప్పగించాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ కారును ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే ఈ ప్రమదం చోటు చేసుకుంది. కారు నెంబరు సహాయంతో ఆ యువతి ఎవరు అనేది పోలీసులు కనుగొనే పనిలో పడ్డారు. అయితే వాహనదారుడికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అమ్మాయిలు బాగా రెచ్చిపోతున్నారనే విషయం బయటపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles