Balakrishna daughter tejaswini marriage

balakrishna daughter tejaswini marriage, Nandamuri Balakrishna daughter Tejaswini marriage, - Balakrishna daughter Tejaswinis Marriage Photos, Balakrishna daughter Tejaswini Marriage Photos, Balakrishna daughter Tejaswini weddin

balakrishna daughter tejaswini marriage, Nandamuri Balakrishna daughter Tejaswini marriage

హైటెక్ హంగులతో కుమార్తె వివాహం చేసిన బాలయ్య

Posted: 08/21/2013 11:01 AM IST
Balakrishna daughter tejaswini marriage

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇంట ఇంత అందంగా రమణీయంగా ఆయన ముద్దుల తనయ తేజస్విని వివాహం జరిగింది. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్ ల వివాహవేడుక హైటెక్స్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ ఉదయం హైదరాబాదు హైటెక్స్ ప్రాంగణంలో వైభవంగా, కన్నుల పండువగా ఈ వేడుక కల్యాణ వైభోగమే ... అన్న రీతిలో జరిగింది. సంప్రదాయం ప్రకారం రకరకాల పూలతో అందంగా అలంకరించిన పల్లకిలో పెళ్లి కూతుర్ని వివాహ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ముహూర్త సమయానికి వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం సిగ్గుల మొగ్గవుతున్న వధువు తేజస్విని మెడలో పెళ్లి కొడుకు మాంగల్యధారణ చేశాడు. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ దంపతులు, అల్లుడు లోకేష్ దంపతులు అందర్నీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles