Botsa meeting with telangana ministers

Botsa Meeting with Telangana Ministers, botsa on samaikyandhra, botsa vs cm kiran, botsa press meet

Botsa Meeting with Telangana Ministers, botsa on samaikyandhra, botsa vs cm kiran, botsa press meet

కమిటీతో సంబంధం లేదంటున్న బొత్స

Posted: 08/16/2013 08:03 PM IST
Botsa meeting with telangana ministers

ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు తెలంగాణ ప్రాంత మంత్రులతో గాంధీభవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ... తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదంటూనే, రాష్ట్ర విభజనకు రాజ్యాంగ ప్రక్రియ అవసరమని అన్నారు. ఆంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది ఆయన అన్నారు. ఈ సమావేశం అనంతరం గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన బొత్స అప్పుడు మాట మార్చి మరో విధంగా మాట్లాడారు. విభజన ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఉన్న సందేహాలను తీర్చేందుకు, అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆంటోని కమిటీ ఏర్పాటు చేసిందని, విభజన పార్టీకి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ అని, దానికీ ఆంటోని కమిటీకి సంబంధం లేదన్నారు. 19, 20 తేదీల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలను కమిటీకి తెలియజేసుకోవచ్చని విభజన నేపధ్యంలో హైదరాబాద్‌కు సంబంధించి, రాజధాని విషయం, నీటి సమస్యల గురించి వారి వారి అభిప్రాయాలను కమిటీకి వివరించవచ్చన్నారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో సీమాంధ్రకు చెందిన నేతలు సమావేశం కానున్నారని తెలిపారు. తెలంగాణ నేతలతో ఒకలాగా, గాంధీభవన్ విలేఖరులతో మరోలాగా మాట్లాడటం పై నేతలు మండి పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles