Samaikya movement impact on temples

Samaikya Movement Impact on temples, Tirumala Tirupati Devasthanams, Kanaka Durga Temple Vijayawada, Indra keeladri Vijayawada, Varalakshmi Vratam

Samaikya Movement Impact on temples

రద్దీ, ఆదాయాలు తగ్గిపోయిన పుణ్యక్షేత్రాలు

Posted: 08/16/2013 12:47 PM IST
Samaikya movement impact on temples

సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్రలోని పుణ్యక్షేత్రాలు వెలవెలబోతున్నాయి.  రద్దీ తగ్గటంతో దేవాలయాల ఆదాయం కూడా తగ్గిపోతోంది. 

ఆగస్ట్ 15 గురువారం కావటంతో నాలుగు రోజులు రోజుకి లక్షమంది యాత్రికులతో రద్దీగా ఉండవలసిన తిరుమల సందర్శించిన భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి హుండీ ఆదాయం కూడా పడిపోయిందని తిరుమల తిరుపతి దేవస్థానముల గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

అలాగే ఈ రోజు వరలక్ష్మీ వ్రతం కావటంతో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద భక్తజన కోటితో కళకళలాడవలసిన కనక దుర్గ ఆలయంలో సామూహిక వ్రతాలైతే జరుగుతున్నాయి కానీ భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది.  స్థానికంగా ఉన్నవారు, సొంత వాహనాలున్నావారు ధైర్యం చేసి వెళ్తున్నారు కానీ ఇతర యాత్రికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోతామేమోనన్న భయంతో ఎక్కువగా సాహసం చెయ్యటంలేదు. 

ఆర్ టి సి బస్సులు డిపోలకే పరిమితమవటం, దేవస్థానం సిబ్బంది కూడా సమ్మె బాట పట్టటంతో యాత్రికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  అయితే, ఈ ఇబ్బందులు తాత్కాలికమైనవని, రాష్ట్రం విడిపోతే వచ్చే ఇబ్బంది శాశ్వతరూపంలో ఉంటుందని ఉద్యమకారులు సీమాంధ్ర ప్రజలకు నచ్చజెప్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles