Thota narasimhamam wife vani fast disturbed

Thota Narasimhamam wife Vani fast disturbed, Thota Vani Indefinite Fast , seemandhra protest, samaikyandhra, formation of telangana, protest continues in seemandhra

Thota Narasimhamam wife Vani fast disturbed, Thota Vani Indefinite Fast , seemandhra protest, samaikyandhra, formation of telangana, protest continues in seemandhra

హైడ్రామా మధ్య మంత్రి భార్య దీక్ష భగ్నం

Posted: 08/16/2013 09:18 AM IST
Thota narasimhamam wife vani fast disturbed

రాష్ట్ర మంత్రి తోట నరసింహం సతీమణి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గత ఆరు రోజులుగా నిరహార దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో ఎట్టకేలకు పోలీసులు ఆమె దీక్షను ఈరోజు తెల్లవారు జామున భగ్నం చేశారు. డాక్టర్లు వాణిని వైద్య పరీక్షలకు తరలించాని సూచించినా ఆమె వినకపోవడంతో భారీగా పోలీసులు దీక్షా స్థలి వద్దకు చేరుకొని ఆమె మద్దతు దారులను చెదరగొట్టి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం నుండి హైడ్రామా మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో దీక్షను భగ్నం చేశారు. ఆసుపత్రికి తరలించినా వాణి దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. మరో వైపు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ స్వయంగా కలుగజేసుకొని దీక్ష విరమించజేయాలని కోరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి నరసింహం కి ఫోన్ చేసి దీక్ష విరమింప జేయాలని సూచించారు. ఇంత హైడ్రామా నడుస్తున్న మంత్రి గారు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles