Film actor srihari contest 2014 assembly elections

Film actor Srihari Contest 2014 , Real Star Srihari, Contest2014 Elections, Srihari going contest Assembly,Kukatpally constituency,Congress Party, Jaya Prakash

Real Star Srihari is going to contest 2014 Assembly Elections from Kukatpally constituency.

జగన్ కి గట్టి షాక్ ఇచ్చిన శ్రీహరి

Posted: 08/14/2013 09:01 AM IST
Film actor srihari contest 2014 assembly elections

సినీ నటుడు, రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయబోతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో తాను రాజకీయాల్లో అడుగు పెట్టి శాసనసభకు పోటీ చేయనున్నట్లు ఆయన నేడు తన పుట్టిన రోజును పురస్కరించుకొని మీడియా తో చెప్పారు. ఈయన వైయస్ జగన్ పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ లో చేరుతాడని, ఆ పార్టీ నుండే పోటీకి దిగబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిసిన శ్రీహరి త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరతానని ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోవడం, సమైక్యాంధ్రకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జై కొట్టడంతో తెలంగాణలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. దీంతో శ్రీహరి ఇఫ్పుడు తన రూటును కాంగ్రెస్ వైపుకు మార్చారు. తాను వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి కుకట్ పల్లి నుంచి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు శ్రీహరి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు చిత్రసీమ మాత్రం విడిపోదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles