Modi was told 60 lies in hyderabad meeting

Modi was told 60 lies, digvijay singh, narendra modi, telangana, samaikyandhra

AP state Congress incharge Digvijay Singh on Monday said Gujarat CM Narendra Modi was told lies in Hyderabad meeting.

మోడీ అన్నీ అబద్దాలే చెప్పాడు : రాజా

Posted: 08/12/2013 02:57 PM IST
Modi was told 60 lies in hyderabad meeting

భారతీయ జనతా పార్టీ ఎన్నికల సారధి అయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘నవభారత యువ భేరి ’ బహిరంగ సభకు హాజరై మాట్లాడిన దాని పై కాంగ్రెస్ వారు మెల్లిమెల్లిగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు మోడీ ప్రసంగం పై విమర్శలు గుప్పించారు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తనదైన స్టైల్లో స్పందించారు. నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో అరవై అబద్దాలు చెప్పారని, మోడీ ఎప్పుడూ వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని, ఆయన మాట్లల్లో కత్తదనం ఏమీ లేదని అన్నారు.  తెలంగాణపై ప్రధాన ప్రతిపక్షం బిజెపిది ద్వంద్వ వైఖరని,  తెలంగాణ, సీమాంధ్రపై మోడీ చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు. పదే పదే తాము తెలంగాణకు అనుకూలమని బిజెపి ఇప్పుడు చెబుతోందని కానీ, గతంలో ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని నాటి ఎంపి నరేంద్ర కలిసినప్పుడు తెలంగాణ ప్రసక్తే లేదని చెప్పారని గుర్తు చేశారు. ఇక నేటి రాత్రి నుండి ఏపీ ఎన్జీఓలు  చేపట్టదలచిన సమ్మె పై స్పందిస్తూ... ఏపీ ఎన్జీఓలు సమ్మె విరమించాలని, సమ్మెతో సాధించేది ఏదీ లేదని, చర్చల ద్వారానే ఏదైనా సాద్యమని, చర్చలకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. మ్మె వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని సూచించారు. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించి ఎకె ఆంటోనీ కమిటికీ అన్ని సమస్యలను తెలియజేయాలన్నారు. వారితో తాము ఇవాళ రేపట్లో చర్చలు జరుపుతామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles