Australian woman hospitalised electric shock from iphone

Australian woman, chatswood, iphone, New South Wales, electric shock, Royal North Shore Hospital, chinese woman, dies, airhostess, apple.

A 20-year-old Australian woman has been hospitalised in Sydney after she got a shock from her iPhone, according to media reports

ఐ ఫోన్ వాడుతున్నారా ? జర జాగ్రత్త..

Posted: 07/25/2013 03:46 PM IST
Australian woman hospitalised electric shock from iphone

సెల్ ఫోన్లు నిత్య జీవితంలో భాగం అయ్యాయి. సెల్ లేనిదే క్షణం కూడా గడవని పరిస్థితి వచ్చింది.  ఇప్పుడా సెల్ ఫోన్లే ప్రాణాలు తీస్తున్నాయి. టెక్నాలజీ ఎంతో అభివ్రుద్ధి చెంది సెల్ ఫోన్ కాస్త ఐ ఫోన్ గా మారింది. గతంలో సెల్ ఫోన్ బ్యాటరీలు పేలి మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ లు కూడా అదే కోవలోకి చేరాయి. మొన్నటికి మొన్న ఐఫోన్ కరెంటు షాక్ కొట్టడంతో చైనాలో ఓ మహిళ మరణించగా, ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఇలాంటి షాక్ తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సిడ్నీకి చెందిన ఈ మహిళ ఫోన్ చార్జింగ్లో పెట్టి మాట్లాడు తుండగా ఉన్నట్టుండి అది కాస్తా షాక్ కొట్టింది. దీంతో ఆమెను రాయల్ నార్త్ షోర్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో ఇలా చార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుండగా షాక్ తిన్న కేసులు తమవద్దకు చాలానే వచ్చాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చిన్న షాక్ తగిలినా అది గుండెకు ప్రమాదమేనని వారన్నారు . ఈ ప్రమాదాలకు కారణం వాడే వ్యక్తుల తీరే అని కంపెనీలు అంటుంటే.. కాదు సెల్ ఫోన్ కంపెనీలదే అని జనం అంటున్నారు. మీదగ్గర కూడా ఐ ఫోన్ ఉంటే జాగ్రత్తగా ఉపయోగించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles