Confusing panchayat results

Confusing Panchayat Results, sarpanch elections, ysr congress, congress, telugudesam, telangana rastra samithi

Confusing Panchayat Results, sarpanch elections, ysr congress, congress, telugudesam, telangana rastra samithi

పంచాయితీ లెక్కలు - కాకి లెక్కలు

Posted: 07/24/2013 09:29 AM IST
Confusing panchayat results

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత పంచాయితీ ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించాయి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఫలితాలు వెలువడ్డాయి. వర్షాలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు అభ్యర్థులు తీర్పు ఇచ్చారు. తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో సైకిల్ పల్లెల్లో దూసుకుపోగా, సైకిల్ వేగానికి హస్తం కాస్త వెనకబడింది. వైసీపీ మూడు జిల్లాల్లో తప్పితే పెద్దగా ఎక్కడా ప్రభావం చూపలేదు. ఇక తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే ముందంజలో ఉంది. తొలివిడతలో తెదేపా 1944 స్థానాలను గెలుచుకొని మొదటి స్థానంలో, కాంగ్రెస్ 1686 స్థానాలను గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. ఇక వైసీసీ 1297, తెరాస మద్దతు దారులు 456, వామ పక్షాల మద్దతుదారులు 64 పంచాతీయిలను కైవసం చేసుకున్నారు. తొలి విడతలో శ్రీకకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు అనంతపురం, రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాలలో పచ్చజెండా ఎగురవేయగా, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో హస్తం గాలి వీచింది. కడప, విశాఖ జిల్లలాలో వైకాపా ఎక్కువ స్థానాలు గెలిచింది. వరంగల్, మెదక్ జిల్లాలలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. అయితే  ఆయా పార్టీల వారు, వారి మద్దతు పత్రికలు, సొంత పత్రికల వారు మాత్రం తనకు ఇష్టం వచ్చినట్లు ఫలితాలు రాశాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఎన్నికల కమీషన్ నుండి కానీ, ఆయా జిల్లాల కలెక్టర్ల నుండి ఖచ్చితమైన ప్రకటన వెలువడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles