Six killed in wall collapse in hyderabad

Hyderabad, Hyderabad rain, Hyderabad wall collapse, six people, including three children

Six people are feared killed in a wall collapse in the Old Wall area on the outskirts of Hyderabad. Rescue workers are removing debris cautiously as they fear that more people could be trapped.

గోడకూలి ఆరుగురి మరణం

Posted: 07/23/2013 08:58 AM IST
Six killed in wall collapse in hyderabad

హైదరాబాద్ నగరంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పేదల పాలిట శాపంగా మారాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమో, దేవుడు వారికి విధించిన శిక్షో కానీ నగరంలో భవనాలు, గోడలు కూలి అమాయక ప్రజలు చనిపోతున్నారు. మొన్నటికి మొన్న నగరంలో సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ఘటన మరవక ముందే... నగరంలో ఉన్న మౌలాలీ ఈ రోజు తెల్లవారు జామున గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6గురు మరణించారు. నగరంలోని మౌలాలీ ఎంజీ కాలనీ గాయత్రినగర్‌లో పురాతన గోడ కూలి రెండు గుడిసెలు నెలమట్టమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెకంటయ్య (30) మహదేవ్ (36) లు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మౌలాలిలో ఆగోడ ప్రక్కన నివాసం ఏర్పరుచుకొని కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పురాతన గోడ కూలి రెండు గుడిసెల పై పడటంతో అందులో ఉన్న వెంకటయ్య, మహదేవ్, అతని భార్య పిల్లలు శివ(12), అనిల్(10) పై శిధిలాలు పడటంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో చిన్నారి లిల్లీని అక్కడి స్థానికులు బటయకు తీసి కాపాడారు. వెంకటయ్య భార్య, అతని పిల్లలు శిధిలాల కిందే ఉండటంతో వారికి కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించడంతో బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఇలాంటి వాటిని వెంటనే తొలగించాలని  స్థానికులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles