Flood victims of karimnagar district distributed food packs

Flood victims of Karimnagar district, Food packs in IAF choppers, Food packs to flood victims, 1500 families in floods, Karimanagar Dist Collector,

Flood victims of Karimnagar district distributed food packs

కరీంనగర్ జిల్లాకు సహాయక చర్యలు

Posted: 07/21/2013 10:20 AM IST
Flood victims of karimnagar district distributed food packs

కరీంనగర్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 1500 కుటుంబాలకు మూడు విమానదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా జాతీయ విపత్తు సహాయక సంస్థ 10000 ఆహార పదార్థాలను పంపిణీ చెయ్యటం కోసం నిన్న ఉదయం తీసుకుని వచ్చింది. 

త్రాగు నీరు, ఆహారం, బిస్కెట్లు, అత్యవసరమైన మందులను తీసుకుని వచ్చిన హెలికాప్టర్లలోంచి మహదేవపురం, మహాముత్తారం మండలాల్లో వరదలతో దిగ్బంధంలో ఉన్న గ్రామవాసులకు పై నుంచి పంపిణీ చేసారు. 

సహాయక చర్యకోసం వచ్చిన నలభై మంది విపత్తు సహాయక సంస్థ సిబ్బందితో పాటుగా కరీం నగర్ జిల్లా కలెక్టర్ ఎమ్.వీరభద్రయ్య హెలికాప్టర్ లోంచి చూస్తూ ఏరియల్ సర్వేలో పరిస్ధితిని పరిశీలించారు.  ముఖ్యంగా పంకెన, పలిమేల, ఓదేడు, పెద్దంపేట, అంబేడ్పల్లి గ్రామాలు పూర్తిగా వరద నీటిమయం అయి ఉండటం గమనించారు.  ఆ గ్రామవాసులకు ఆహార ప్యాకెట్లు పైనుంచి అందించటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles