Former ministers sabita and dharmana case adjourned

sabita dharmana judicial custody, sabita indrareddy, dharmana prasadarao, cbi special court, cbi charge sheets on sabita, cbi charge sheets on dharmana,

former ministers sabita and dharmana case adjourned to 19th

సబిత, ధర్మాన కేసు 19కి వాయిదా

Posted: 07/12/2013 03:22 PM IST
Former ministers sabita and dharmana case adjourned

మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుల జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ కి ప్రతిగా వేసిన కౌంటర్ పిటిషన్ మీద సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈరోజు విచారణ 19 వ తేదీకి వాయిదా పడింది.

సిబిఐ ఛార్జ్ షీట్ తర్వాత రాజీనామా చేసిన మాజీ మంత్రులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాటలను సిబిఐ తప్పు పట్టింది.  అధికారంలో ఉన్నప్పుడు తమ పలుకుబడిని దుర్వినియోగం చెయ్యటమే కాకుండా ఇప్పుడు సాక్షులను ప్రభావితం చెయ్యటానికి బాహాటంగానే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వారిద్దరి మీదా అభియోగం మోపిన దర్యాప్తు సంస్థ అందుకు సాక్ష్యంగా ఇంటర్ నెట్ లోంచి డౌన్ లోడ్ చేసిన వీడియోలను లోగడ కోర్టుకి సమర్పించగా, అలా కాదు పూర్తి వీడియోలను చూసిన తర్వాతనే కౌంటర్ దాఖలు చేస్తామని కోరిన మాజీ మంత్రుల కోరిక మేరకు కోర్టు ఆదేశం ప్రకారం సిబిఐ టివి ఛానెల్స్ నుంచి పూర్తి వీడియోలను సంపాదించి కోర్టుకి సమర్పించింది. 

దానిమీద ఈ రోజు జరగవలసిన విచారణ 19వ తేదీకి వాయిదా పడింది.  ఆ వీడియోల్లో, తాము నిర్దోషులమని, తెలిసి ఎటువంటి తప్పులూ చెయ్యలేదని, తమ మీద కేసు నిరాధారమైనదని, అందువలన తప్పక ఈ కేసులోంచి బయటపడతామని మాజీ మంత్రులిద్దరూ మీడియాకు చెప్తూ, తమని కళంకితులని పిలవవద్దని కూడా వాళ్ళని అర్థించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles