Congress meet on telangana heightens anxiety

core committee crucial meeting, telangana, andhra pradesh, congress party, UPA, july 12, cm kiran kumar reddy, pcc botsa, Congress leader Digvijay Singh

With two days to go for the Congress core committee crucial meeting on Telangana, anxiety is growing in all three regions of Andhra Pradesh

కోర్ కమిటీ భేటీ పై ఉత్కంఠ

Posted: 07/11/2013 07:51 AM IST
Congress meet on telangana heightens anxiety

మరో కొన్ని గంటల్లో జరగబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటికి సమయం దగ్గరపడింది. ఈసారి కోర్ కమిటీ తరువాత అటో ఇటో తేల్చాస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో ఆ గడియలు దగ్గర పడుతుండటంతో ఇటు సీమాంధ్ర నేతల్లోనూ, అటు తెలంగాణ నేతల్లోనూ ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఇక కోర్ కమిటీ భేటీకి రోడ్ మ్యాప్ లతో రావాలని చూచించడంతో ఇటు ముఖ్యమంత్రి, అటు పీసీసీ అధ్యక్షుడు బొత్స, ఉప ముఖ్యమంత్రి వారి వారి నివేదికలను సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్‌లోని సమైక్య, వేర్పాటు నేతలు చివరి నిమిషం ప్రయత్నాలకు పదును పెంచారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ మంత్రులతో ముందుగా, సీమాంధ్ర మంత్రులతో ఆ తర్వాత ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.  రాష్ట్రం సమైక్యంగా ఉంటే లాభాలు, విడిపోతే జరిగే నష్టాలపై తన నివేదిక ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనందున సహకరించాలని కిరణ్ కు తెలంగాణ మంత్రులు విన్నవించారు. కాగా రాష్ట్రం కలిసి ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని, లేదంటే రాష్ర్టం చిన్నాభిన్నం అవుతుందని సీమాంద్ర మంత్రులు సూచించారు. విభజన జరిగితే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని వారు పేర్కొన్నారు. ఢిల్లీని ప్రభావితం చేసేందుకు అవసరమైతే ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించాలని, ఇందుకోసం గవర్నర్‌ను కలవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు యోచిస్తున్నట్టు సమాచారం. ఇటు తెలంగాణ నాయకులు వారి వాదనకే కట్టుబడి ఉన్నారు.

```````````````````````````````

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles