Mlc hussain was gave his resignation

MLC Hussain, MLC Hussain resignation samaikyandhra, telangana, kadapa, sailajanath

MLC Hussain was gave his resignation to Samaikyandhra JAC.

సమైక్య రాష్ట్రం కోసం ఎమ్మెల్సీ రాజీనామా

Posted: 07/10/2013 09:48 AM IST
Mlc hussain was gave his resignation

రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ఇచ్చేస్తున్నారనే ఊహాగానాలు, కోర్ కమిటీ భేటీలు, రోడ్ మ్యాప్ లో రాజకీయాలు వేడెక్కడంతో సమైక్యంద్రలో మళ్లీ రాజీనామాల నాటకాలు మొదలయ్యాయి. గతంలో డిసెంబర్ 9 ప్రకటన తరువాత సీమాంద్రకు చెందిన నేతలు రాజీనామాల నాటకం ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కేంద్రం తెలంగాణ విషయంలో ఏదో ఒక నిర్ణయం వెల్లడించబోతుందనే వార్తలు వెలువడుతుండటంతో  సమైక్యాంధ్ర కోసం కొంత మంది నాయకులు రాజీనామాల బాట పట్టారు. తాజాగా శాసన మండలి సభ్యుడు హుస్సేన్ రాజీనామా చేశారు. రాయలసీమను విడగొట్టవద్దంటూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ రాజీనామా చేశారు. మంగళవారం సమైక్యాంధ్ర కార్యాచరణ కమిటీ నేతలు షేక్ హుస్సేన్ ఇంటిని ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు. వెంటనే ఆయన రాజీనామా పత్రాన్ని వారికి అందజేశారు. మరో నాయకుడు అయిన రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి సీమను విడగొడితే శాసన సభ ఎదుట ఉరి వేసుకుంటానని  స్పష్టం చేశారు. కేంద్రంలో కదలిక రాగానే వీరు రాజీనామాల డ్రామాలు మొదలు పెట్టడం సరికాదని తెలంగాణ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles