Chandrababu calls to tdp workers no sleeping

chandrababu calls to tdp workers, no sleeping, local body polls, 27 days, No sleep for 27days, tdp workers, tdp, chandrababu naidu, congress party, ysr congress party, panchayati election,

Chandrababu calls to tdp workers, no sleeping

27 రోజులునిద్ర పథకం?

Posted: 07/05/2013 04:07 PM IST
Chandrababu calls to tdp workers no sleeping

నేను నిద్రపోను.. మీమ్మల్ని నిద్రపోనివ్వను అనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులకు నిద్రలేకుండా చేసి, ముఖ్యమంత్రి పదవిని పొగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మళ్లీ అదే రూల్ ను తన పార్టీ కార్యకర్తలు పాటించాలని హుకూం జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ముంచుకుస్తున్న కొద్ది చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదు. బాబుకు తోడుగా తన కార్యకర్తలు నిద్రపోకుడదనే ఉద్దేశంతో, 27 రోజులు నిద్ర పథకం మొదలుపెట్టాడు. వచ్చే 27 రోజులు కార్యకర్తలు నిద్రపోకుండా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో పార్టీ కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ వందశాతం పంచాయతీలు సాధించాలని, పార్టీగెలుపు చారిత్రక అవసరమని పేర్కొన్నారు. పంచాయతీలకు మంచి నాయకుల్ని ఎన్నుకుంటేనే ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దడం వీలవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ తొమ్మిదేళ్ల పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని విమర్శించారు. బంగారు తల్లి పథకం తమ పార్టీదేనని, దాన్ని తాము మహాలక్ష్మి పేరుతో అమలు చేద్దామనుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి పేరుమార్చి ప్రకటించుకున్నారని చెప్పారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles