Sikh couple kicked out of movie theater for wearing kirpan

Sikh Couple Kicked Out Of Movie Theater, AMC Theatres, American citizens, Manjot Singh, national policy, safety and security

Sikh Couple Kicked Out Of Movie Theater For Wearing Kirpan

సిక్కుల జంటకు సినిమా అవమానం

Posted: 07/04/2013 11:13 AM IST
Sikh couple kicked out of movie theater for wearing kirpan

గతంలో ‘ఖాన్ ’ అనే పేరు కలిగిన వ్యక్తులపై అమెరికా ద్రుష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మన బాలీవుడ్ హీరో షారుఖాన్ కు అమెరికా వారు విచిత్రమైన అనుభవం చూపించారు. పేరు చివర ఖాన్ ఉంది కాబట్టి షారుఖాన్ ను అమెరికాలోని ఎయిర్ పోర్టు అధికారులు రెండు గంటలపాటు.. షారుఖాన్ కు హాలీవుడ్ సినిమా చూపించారు. అదే బాటలో అమెరికాలోని సినిమా థియేటర్ యాజమాని సిక్కు దంపతులను అవమానించారు. కేవలం చిన్న కత్తి కలిగి ఉందనే ఉద్దేశంతో ఆ సిక్కు దంపతులను సినిమా థియేటర్ నుంచి బయటకు పంపించారు. మత సంప్రదాయం ప్రకారం ధరించే కృపాణ్ (చిన్న కత్తి)ను కలిగి ఉన్నందుకు.. అమెరికాలో సిక్కు దంపతులను ఓ సినిమా థియేటర్ నుంచి అర్ధాంతరంగా బయటకు పంపించారు. పైగా అది తమ నిబంధనల్లో భాగమంటూ వాదించారు.

దీంతో వారికి థియేటర్ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే న్యాయపోరాటం చేస్తామని అమెరికాలోని సిక్కు న్యాయవాదుల అసోసియేషన్ ‘యునెటైడ్ సిఖ్’ డిమాండ్ చేసింది. మన్‌జ్యోత్ సింగ్ జూన్ 22న తన భార్యతో కలిసి ఎమెరీవిల్లే ప్రాంతంలోని ఏఎంసీ థియేటర్‌లో సినిమాకు వెళ్లారు. కానీ, మన్‌జ్యోత్ తలపాగాతో పాటు ఆయన ధరించిన కృపాణ్‌ను చూసిన థియేటర్ నిర్వాహకులు కొద్ది సేపు లాబీలో నిలబెట్టారు. ఆ తర్వాత బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీంతో ఆ థియేటర్ యాజమాన్యంపై మన్‌జ్యోత్‌తో పాటు ‘యునెటైడ్ సిఖ్’ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. మతం, ఆచారాలతో తమకు సంబంధం లేదని, ఆయుధం (కత్తి) ధరించినందునే తాము బయటకు పంపించాల్సి వచ్చిందని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. తమ వినియోగదారుల భద్రత, క్షేమమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles