Shankar rao explanation on daughter in law matter

hanker rao, and his wife vishwa shanthi, surrendered, in ccs, womens police station, daughter in law case, vamshi priya, filed a petition

Shankar Rao explanation on Daughter-in-law matter.

ఆమె ఏనాడో డ్రైవర్ తో ...పోయింది

Posted: 06/20/2013 01:49 PM IST
Shankar rao explanation on daughter in law matter

మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు పై తన కోడలు తనను మానసికంగా వేధిస్తున్నారని శంకర రావు పై, కుటుంబ సభ్యుల పై హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దీని పై విచారించిన కోర్టు అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీని పై నోరు మెదపని శంకర్ రావు తాజాగా వివరణ ఇచ్చారు. తమ కోడలుగా చెబుతున్న ఆమె మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్ తో వెళ్లి పోయిందని, అప్పటి నుండి తనతో ఉండటం లేదని, ఆమె తనపై అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తను డిజిపిపై ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేస్తున్నందున ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి శంకరరావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకే  అధికార పక్షంలోని కొందరు నా పై కక్ష్యగట్టి ఇలా చేస్తున్నారని అన్నారు. తన పై ఇలానే చర్యలు కొనసాగితే తెలంగాణలో పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అని అన్నారు. అయితే తన కోడలు డ్రైవరు తో వెళ్లిపోయిందని చెబుతున్న దానిలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఆయన కోర్టుకు వెళ్ళి వివరణ ఇస్తే సరిపోతుంది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles