Political ex minister mopidevi venkataramana rao shifted to hospital

mopidevi venkataramana rao, ex minister mopidevi venkataramana rao, chanchalguda jail to osmania general hospital, congress party, breaking news, ap politics, political news, andhra news

Ex minister Mopidevi Venkataramana Rao shifted to hospital

మోపిదేవిని ఉస్మానియా ఆస్పత్రికి

Posted: 06/17/2013 01:27 PM IST
Political ex minister mopidevi venkataramana rao shifted to hospital

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రి పని చేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు, వాన్ పిక్ కేసు విషయంలో చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల విషయంలో మోపిదేవి పేరు ఉండటంతో ఆయన్ని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి మోపిదేవిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చంచల్ గూడ జైల్లో ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆయనకు ఈరోజు ఉదయం జైల్లోనే వైద్యులు ప్రాధమిక వైద్యం అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మోపిదేవిని జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు. ఛాతినొప్పితో బాధపడుతూ వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఉస్మానియా ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్య పరీక్షలు, చికిత్స చేస్తున్నారు. ఆయన గత రాత్రి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడటమే కాకుండా, ఛాతినొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles