High tension hyderabad

assembly, telangana, ou jac, hyderabad, hyderabad, city 144section, chalo assembly programme, telangana political jac, congress party, cm kiran kumar reddy,

Battle lines have been drawn between the protagonists of Telangana and the police as the Telangana Joint Action Committee has decided to go ahead with its Chalo Assembly programme on Friday

హై టెన్షన్ లో హైదరాబాద్... సై అంటే సై

Posted: 06/14/2013 10:11 AM IST
High tension hyderabad

తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఐక్యకార్యచరణ సమితి (జేఏసీ) ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.  అయినా తెలంగాణ వాదులు తన ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ ఎత్తున కార్యక్తర్తలు హైదరాబాద్ కు చేరుకున్నారు. చేరుకుంటున్నారు. వారిని పోలీసులు ఎక్కడికి అక్కడ ఆపేసి అదుపులోకి తీసుకుంటున్నారు.  పలు జిల్లాల నుండి తెలంగాణ వాదులు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఈ రోజు సమావేశాలు ప్రారంభం కాగానే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో జై తెలంగాణ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని టిడిపి, తెరాస సభ్యులు చుట్టుముట్టారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

నగరంలో 144వ సెక్షన్ చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ని సికింద్రాబాద్ జూబ్లి బస్ స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. భాజాపా సీనియర్ నేతలను వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ని, హనుమంతరావును పోలీసులు రామంతాపూర్ లో అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థులు ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీగా వస్తున్న విద్యార్థులను ఎస్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి ప్రస్తుతం హైదరాబాద్ అంతా టెన్షన్ వాతావరణంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles