Veerasiva reddy fire on d l raveendra reddy

Veerasiva reddy fire, DL Ravindra, AP government, Veera Shiva Reddy

Veerasiva reddy fire, DL Ravindra, AP government, Veera Shiva Reddy

శివాలెత్తిన శివారెడ్డి

Posted: 06/06/2013 01:28 PM IST
Veerasiva reddy fire on d l raveendra reddy

మంత్రి వర్గం నుండి ఉద్వాసనకు గురైన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పై, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శలు చేస్తుంటే, కిరణ్ వర్గం మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. తాజాగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన వీరశివారెడ్డి డీల్ పై వీరశివాలెత్తాడు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీరశివా రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ మంత్రి అయిన డీఎల్ ప్రభుత్వానికి గానీ, పార్టీకి  గానీ మంచిపేరు తెచ్చేలా ఎప్పుడైనా ప్రవర్తించారా ? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలిచి పదవి ఇస్తే ఆయన పైనే కాకుండా ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పట్టుకున్నారని, డీఎల్ కి ఏమైనా ఉంటే, ఉప ఎన్నికల అప్పుడు తన సొంత నియోజక వర్గం నుండి డిపాజిట్టు కోల్పోయినప్పుడే తన పదవికి రాజీనామా చేయాల్సిందని అన్నారు. ఇప్పటికే ఘాటైన వ్యాఖ్యలతో విమర్శిస్తున్న డీఎల్ వీరశివా వ్యాఖ్యల పై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles