Political ysrcp will close down in 3 months tdp varla ramaiah

varla ramaiah, tdp varla ramaiah, YSRCP will close down in 3 months, ys jagan, jagan-yrs, tdp, ysrcp, congress party, tdp mahanadu, ysrcp deeksha, ys jagan bill petition, supreme court, 2014 election, ys sharmila, ys bharanthi, iddarammalato movie review, trs vs tdp

ysrcp will close down in 3 months-tdp varla ramaiah

మూడు నెలల్లో మూతపడుతున్న వైసీపీ పార్టీ?

Posted: 06/01/2013 11:46 AM IST
Political ysrcp will close down in 3 months tdp varla ramaiah

కాలం చాలా వేగం దూసుకువస్తుంది. అప్పుడే సంవత్సరం తిరిగిపోయింది. గతం సంవత్సరం ‘మే’న అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు కు వెళ్లి మొన్నటికి సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో వైఎస్ జగన్ పెట్టిన పార్టీలో రాజకీయ మార్పులు ఎన్నో జరిగాయి. అయితే జగన్ జైలుకు వెళ్లి 365 రోజులు అయిన సందర్భంగా (నిరసనగా) పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కొన్ని కార్యక్రమాలు చెపట్టారు. అంటే వైఎస్ జగన్ కు మద్దతు గా ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది. అందులో భాగంగా దీక్షలు, నిరసనలు, కొవ్వుత్తుల ర్యాలీలతో, జగన్ మీద ఉన్న ప్రేమను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాటుకున్నారు.

ఈ కార్యక్రమలో ఆ పార్టీ నాయకులు, ప్రభుత్వం , ప్రతిపక్ష రాజకీయ పార్టీ మీద కొన్ని ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు జరిగే సమయంలో అధికారపార్టీ లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నియోజక వర్గం అయిన పీలేరులో రెండు రోజులు సందడి చెయ్యటం జరిగింది. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో రెండు రోజులు నగరంలో సందడి చేసింది. ఒకే రోజు రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు మీడియా వారికి చుక్కలు చూపించాయి. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తారోనని ఒంటి కన్నుతో మీడియా వారు ఎదురుచూపులు చూశారు. అయితే మూడు ప్రధాన పార్టీలు ఒకరి పై ఒకరు ఘాటైన విమర్శలతో మాటల యుద్దం చేసుకోవటం జరిగింది.

ఆ సమయంలో వైసీపీ పై టిడిపి నాయకుడు పేల్చిన కొన్ని విమర్శలతో, ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడ్డారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో వైసీపీ తలుపులు మూసివేస్తుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం మూతపడుతుందని ఆయన జోష్యం చెప్పారు. వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు నిజమే అనే విధంగా ఉన్నాయి. జగన్ ఎన్నిసార్లు బెయిల్ కు ఫిటిషన్ వేసిన, ఆయనకు బెయిల్ రాని విషయం అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జగన్ బెయిల్ ఫిటీషన్ పై చేసిన వ్యాఖ్యలకు, వర్ల రామయ్య మాటలకు దగ్గర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వర్ల రామయ్య వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల ముఖంలో నిరుత్సాహం తాండవం చేస్తుంది. అయితే వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి ఇదే చివరి మహానాడు అని కామెంట్ చెయ్యటం జరిగింది. కానీ ఈ మూడు నెలల్లో ఏం జరుగుతుందో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles