Telugu desam chandrababu lose talk covers blue films

politics, chandrababu naidu, padyathra, cm, congress, tdp, national media, jail, tdp chandrababu naidu, ysr congress party, ys jagan, balakrishna, lokesh babu, chanchalaguda jail

chandrababu lose talk covers blue films

బాబు ..నీలిచిత్రాలు చూస్తున్నారు!

Posted: 05/30/2013 09:16 AM IST
Telugu desam chandrababu lose talk covers blue films

చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణతో రాత్రి భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కూడా ఉన్నారు. సుమారు గంటకు పైగా వియ్యంకుడి నివాసంలో చంద్రబాబు గడిపారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం గురించి వీరు చర్చించుకున్నట్టు సమాచారం. అయితే ఈ సమయంలో బాబు ఒక విచిత్రమైన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. జైళ్లలో ఉండే నిందితులు లేదా ఖైదీలు మద్యం తాగడంతోపాటు వినోదం కోసం నీలి చిత్రాలు కూడా చూస్తున్నారని, అంతేకాకుండా అక్కడి నుంచే సెటిల్‌మెంట్లు, హత్యలు చేయిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

జైళ్లలో నెలకొన్న పరిస్థితులు తాను సొంతగా చెప్పినవి కావని, పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయన్నారు. చంచల్‌గూడ జైల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసంటూ జైళ్లలో మద్యం సేవించడంతో పాటు నీలిచిత్రాలు ప్రదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పార్టీలో విభేదాలను లోపలున్న వ్యక్తి పరిష్కరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఆక్రోశం వెలిబుచ్చారు. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనలు, ధర్నాలు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. హత్యలు చేసినవారు, తీవ్రవాదులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినవారు ధర్నాలు చేస్తే ఎలా అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles