Deaths by sunstroke in ap

sunstroke in andhra pradesh, 300 public died, temperatures incresing gradually, westerlies, environment department, hospitals, government

sunstroke in andhra pradesh, 300 public died, temperatures incresing gradually, westerlies, environment department, hospitals, government

భానుడి దెబ్బకు 300 మంది మరణం

Posted: 05/25/2013 08:57 AM IST
Deaths by sunstroke in ap

రాష్ట్రంలో భానుడు భగ భగ మండి పోతున్నాడు. భానుడి దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరాదిన వీస్తున్న వడగాలుల దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారంటే ఎండలు ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు, యువకులు, మహిళలు అనకుండా సుమారు 200 మందికి పైగా వడగాల్పులకు మరణించినట్లు అనధికార అంచనాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క శుక్రవారం రోజున మృతి చెందిన వారు సుమారు 200 మందికి పైగా ఉండవచ్చని తెలుస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో 20 మంది, ప్రకాశం జిల్లాలో 28, వరంగల్‌లో 20, నల్గొండ 15, గుంటూరు 24, విశాఖపట్నం 14 మంది చొప్పున మరణించారు. మరో రెండు రోజులు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్నది.  రాజధానిలోని ఒక్క నిలోఫర్ ఆస్పత్రిలో 17 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో వడగాలుల దెబ్బకు చాలామంది మృత్యువాత పడుతున్నారు. భానుడి ప్రతాపానికి తోడు కరెంట్ కోతలతో బయటికి రావాలంటే జనం అవస్థలు పడుతున్నారు. పల్లెటూర్లలో పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. బయటకొస్తే ఎండలు.. ఇంట్లో ఉంటే కరెంట్ కోతలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండాకాలాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles