Political mla nagam janardhan reddy join in bjp party

nagam janardhan reddy, mla nagam janardhan reddy, bjp party, mla kishan reddy, june 3rd nagam join in bjp party, trs party, telangana issue, tdp party, trs leaders,

mla nagam janardhan reddy join in bjp party

మంచి అభ్యర్ది దొరికారు

Posted: 05/23/2013 01:45 PM IST
Political mla nagam janardhan reddy join in bjp party

తెలంగాణ రాష్ట్ర నగర సమితి నాయకుడికి మంచి ముహుర్తం కుదిరింది. టిడిపి నుండి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే నాగం జనార్థన రెడ్డి ఎట్టకేలకు పెద్ద పువ్వు (కమలం) తో కలిసిపోతున్నారు. మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున తాను పోటీచేస్తానని సీనియర్ నేత, నాగం జనార్దనరెడ్డి ప్రకటించారు.ఆ నియోజకవర్గంలో ఈయన గట్టి అభ్యర్ధి అవుతారని భావిస్తున్నారు. గత ఉప ఎన్నికలో మహబూబ్ నగర్ నుంచి శాసనసభకు బిజెపి ఎన్నికైన నేపద్యంలో ఈయన లోక్ సభకు పోటీచేస్తే మంచి ఊపు వస్తుందన్న అభిప్రాయం ఉంది

గతంలో టిడిపితో కలిసి బిజెపి పోటీచేసినప్పుడు ఇక్కడ ఒకసారి ఆ పార్టీ అభ్యర్ధిగా జితేందర్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నారు. కాగా నరేంద్ర మోడీని ప్రదాని అబ్యర్దిగా ప్రకటిస్తే బిజెపికి మంచి ఊపు వస్తుందని నాగం అన్నారు. వచ్చేనెల 3 తేదిన బీజేపీలో చేరుతానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడుగా కూడా ఉన్న జనార్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేస్తానని ఆయన చెప్పారు. అయితే ఎంపీ గా రాబోయో ఎన్నికలో పోటీ చేస్తానని నాగం పెద్ద పువ్వు సాక్షిగా చెప్పారు. నాగం పై ఆశలు పెట్టుకున్న చిన్నపువ్వు (గులాబీ) నేతలకు నిరాశ మిగిలింది. నాగం విషయంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విజయం సాధించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles