Rambabu love marriage with sony hizra in khammam district

love marriage, with hizra, in khammam district, hizra sony groom, bride rambabau, jeella chervu, venkateswara temple, church compound, love affair, family members

rambabu love marriage with sony (hizra) in khammam district

హిజ్రాను పెళ్లాడిన నవ యువకుడు..!

Posted: 05/20/2013 06:23 PM IST
Rambabu love marriage with sony hizra in khammam district

ఈ రోజుల్లో సెల్ ఫోన్ కు సిమ్ కార్డు ఎంత అవసరమో.. అబ్బాయికి, అమ్మాయికి ప్రేమ అనేది అంత అవసరం అయ్యింది. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రేండ్ కావాలి. ఒక అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇది జాగమెరిగిన సత్యం. అయితే ఒక హిజ్రాకు బాయ్ ఫ్రెండ్ తో అవసరం ఉందా? హిజ్రాను ఎవరైనే ప్రేమిస్తారా? హిజ్రాను ఎవరైన పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం అందరికి తెలుసు. కానీ ఒక నవ యువకుడు 10 సంవత్సరాల నుండి ఒక హిజ్రాను ప్రేమిస్తున్నాడు. అంతేకాదండోయ్ … ఆ హిజ్రాతో తన నిండూ నూరేళ్లు కలిసి జీవించాలనే ఉద్దేశంతో మరో అడుగు ముందుకేశాడు. ఎన్నో చీదరింపులు, ఛీత్కారాలు ఎదురైనా.. ఓ యువకుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, జీళ్ల చెరువులో ఆదివారం చోటుచేసుకుంది. పెద్దలు వీరిని విడదీయడానికి ప్రయత్నించినా వెనకడుగు వేయకుండా, హిజ్రాల సంక్షేమ సంఘాన్ని, మీడియా ప్రతినిధులను ఆశ్రయించారు. వీరి సాయంతో జీళ్ల చెరువులో ఉండే రాంబాబు, అదే విధిలో ఉండే (హిజ్రా) సోనీ. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రాంబాబు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి వ్యతిరేకంగా ఉండటంతో మీడియా సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి హిజ్రాలు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు తెలుస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles