Six killed in road accident at eluru

six persons killed, two cars collided, east godavari district, car accident, eluru, karnataka to annavaram in east godavari, government hospital

six killed in road accident at eluru

గాలిలో కారు అదుపుతప్పి ఆరుగురి ప్రాణాలు తీసింది

Posted: 05/18/2013 10:03 AM IST
Six killed in road accident at eluru

విధి విచిత్రం గా ఉంటుంది. మనిషికి మరణం ముందుందని ఉందని తెలిసినా కూడా ఎన్నో కలల మధ్య తన జీవితాన్ని గడుపుతాడు. అయితే మనిషికి మరణం ఎటు వైపునుంచి వస్తుందో మాత్రం మనిషికి తెలియాకుండా చేశాడు ఆ బ్రహ్మ. అయితే కొంత మంది తమ స్వహస్తాలతో మరణాన్ని ఆహ్వానిస్తారు.. మరికొందరికి ఆ దేవుడే మరణాన్ని ప్రసాధించాడు అంటే వారి వయస్సు చివర దశలో ఉన్నప్పుడు మాత్రమే. కానీ అనుకోకుండా కొంత మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ పరిణామాన్ని ఎవరు ఊహించలేరు. ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో మరణం వస్తుందో ఎవ్వరికి తెలియాదు.

కానీ చివరకు వారి బంధవులు, కుటుంబ సభ్యులకు కన్నీరు మిగులుతుంది. విశాలమైన రోడ్లు, చేతిలో కారు స్ట్రీరింగ్, కాలు కింద ఎక్స్ లేటర్.., ఎదురుగా వచ్చే వాహనాలు అసలే ఉండావు, అడ్డు చెప్పే వారు అసలు ఉండారు. కారు వేగం పేరుగుతున్న కొద్ది.. మ్రుత్యువు దగ్గరవుతున్నమని మనకు అప్పుడు తెలియాదు. కానీ తెలుసుకోనే లోపే వారు ఉండారు. అతి వేగం ప్రమాదకరం అని బోర్డు లు ప్రతి వాహనం వెనుక వాసి ఉంటుంది, కానీ వేగమే నా ముద్దు అంటూ మ్రుత్యువు ను నిద్ర లేపుతున్నారు. విశాలమైన రోడ్ల మద్య వ్యతిరేక దిశలో వెలుతున్న కార్లు .. గాలిలో పైకి లేచి ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి.

వేగంగా వెళుతున్న కారు టైరు పేలిపోవడంతో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. దెందులూరు మండలం కొమిరేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉదయం ఈ ఘటన జరిగింది. కర్ణాటక నుంచి వస్తున్న కారు టైరు పేలిపోయి డివైడర్‌ను ఢీకొని గాల్లోకి లేచింది. అది పక్క లేన్‌లోకి దూసుకుపోయి మరో కారును ఢీ కొట్టడంతో రెండు కార్లలోని మొత్తం ఆరుగురూ మరణించారు కొమిరేపల్లి సమీపానికి వచ్చే సరికి వేగంగా వెళుతున్న కారు టైరు పేలిపోయింది. దీంతో జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొని గాలిలోకి ఎగిరి కుడివైపు రోడ్డులోకి వెళ్లి తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న మరో కారు (టాటా ఇండికా)ను ఢీకొంది.

ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జయిపోయాయి. కర్ణాటక నుంచి వస్తున్న కారులో ఉన్న శ్రీరామచంద్రమూర్తి మినహా మిగిలిన ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ఏలూరు వైపు వెళుతున్న కారులో ప్రయాణిస్తున్న గూడెంలోని ఓ ట్రాక్టర్ షోరూం మేనేజర్‌గా పనిచేస్తూ తణుకులో నివాసం ఉంటున్న మద్దుకూరి శ్రీనివాసరాజు(45), ఉంగుటూరు మండలం ఎ.గోకవరానికి చెందిన సేల్స్‌మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు(29) అక్కడికక్కడే మరణించారు.కార్లు నుజ్జవడంతో లోపల ఉన్నవారి అవయవాలు విరిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. కొన ప్రాణాలతో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

మృతదేహాలను కార్లలోంచి బయటకు తీయడానికి క్రేన్ సాయంతో పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది.ఇంటి శంకుస్థాపనకు ముహూర్తం పెట్టించడానికి వచ్చి..: మృతుల్లో సుధాకర్, నవీన్, శ్రీనివాసరావుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ముద్దాపురం. వీరి తల్లిదండ్రులు 30 ఏళ్ల కిందటే కర్ణాటకలో స్థిరపడి వ్యవసాయం చేస్తున్నారు.

అక్కడే ఇల్లు నిర్మించుకునేందుకు శంకుస్థాపన ముహుర్తం కోసం కొల్లి సుధాకర్ రేలంగిలోని తంగిరాల ప్రభాకర్ పూర్ణయ్య సిద్ధాంతి వద్దకు బయలుదేరారు. ఆయనకు పరిచయస్తుడైన శ్రీరామచంద్రమూర్తిని వెంట తీసుకొచ్చారు. రేలంగిలో పని ముగించుకున్న తరువాత వారు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వెళ్లి సత్యదేవుని దర్శించుకోవాలనుకున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles