Political ghazal srinivas joined in congress party

ghazal srinivas, ghazal srinivas joined in congress party, ghazal srinivas latest news, ghazal srinivas joined congress party at gandhi bhavan, lagadapati rajagopal and former minister shabbir ali attended in gandhi bhavan, mothers inspiration for ghazal srinivas to joined in congress,

ghazal srinivas joined in congress party

ghazal-srinivas.gif

Posted: 05/12/2013 04:27 PM IST
Political ghazal srinivas joined in congress party

కాంగ్రెస్ లో ఉన్న నాయకులే పదవుల కోసం కొట్టుకు చస్తున్నారు. మళ్లీ కొత్త మరో పాటల గాయకుడు పార్టీలో చేరటం పై సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాసు కాంగ్రెసు పార్టీలో చేరారు. హైదరాబాదులోని గాంధీ భవనంలో కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో అతను చేరారు. గజల్ శ్రీనివాస్‌కు డిఎస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. తన తల్లి, తాత స్పూర్తిలతోనే తాను కాంగ్రెసు పార్టీలో చేరానని అన్నారు. చేరితే కాంగ్రెసులోనే చేరాలని వారు చెప్పేవారన్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా, గజల్ శ్రీనివాస్ తెలుగు గజల్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చారు. లగడపాటి రాజగోపాల్ సన్నిహితుడు, గజల్ గాయకుడు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.ఎవరైనా పిసిసి అద్యక్షుడు సమక్షంలో పార్టీలో చేరతారు. ఈయన ఏమిటో మాజీ అద్యక్షుడు వద్ద చేరారు. బహుశా డి.శ్రీనివాస్ మళ్లీ పిసిసి అద్యక్షుడు అవుతున్నారని వీరు భావిస్తున్నారమో.

అయితే డి.శ్రీనివాస్ తో కూడా గజల్ శ్రీనివాస్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇతని స్వగ్రామం. ఇతని అసలు పేరు కేశిరాజు శ్రీనివాస్. 1986 నుండి తెలుగులో గజల్స్ గానం చేస్తూ, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనేగానం చేస్తున్నారు. హార్మోనియం, తబలా, సరోద్‌ల వంటి ప్రక్క వాయిద్యాల సహకారం లేకుండా కేవలం కంజీరాను సహ వాయిద్యంగా ఉపయోగిస్తూ, దానిని తానే వాయిస్తూ శృతి లయాత్మకంగా గానం చేయడం విశేషం. ఇతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశారు. ఇతని తల్లిదండ్రులు రత్నావళి, నరసింహ రావు. భార్య సురేఖ, ఒక కూతురు సంస్కృతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles