Harish rao arrested at sidhipet bus depot

harish rao arrest, medak dist bundh, bundh call by trs, mla jaggareddy, kiran kumar reddy, trs party, kcr

harish rao arrested at sidhipet bus depot

హరీశ్ రావు అరెస్ట్

Posted: 05/03/2013 11:38 AM IST
Harish rao arrested at sidhipet bus depot

 

 

 

మెదక్ జిల్లాలో సాగుతున్న బంద్ లో భాగంగా సిద్ధిపేటలో బస్ డిపో ముందు కార్యకర్తలతో కలిసి బస్సులను అడ్డుకుంటూ ఆందోళనకు దిగిన తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేసారు.  

బయ్యారం గనులను విశాఖ స్టీల్ కే ఇస్తున్నాం, అందుకు జీవో పాసైంది.  అందుకు ఏం చేసుకుంటే అది చేసుకోవచ్చని ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి కెసిఆర్ కి చేసిన సవాల్ కి స్పందించిన కెసిఆర్ వెంటనే ఆ వ్యాఖ్యలు చేసిన మెదక్ జిల్లాలో బంద్ కి పిలుపునిచ్చారు.  బయ్యారం గనులకూ మెదక్ జిల్లాకు ఏమిటి సంబంధమంటూ సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి, ఎటువంటి సందర్భంలోనూ బంద్ ని సాగనివ్వమంటూ ప్రకటించారు.  దానితో వ్యక్తిగత పోరాటాల రంగునద్దుకున్న బంద్ ని ఎలాగైనా విజయంవంతం చెయ్యాలని తెరాస, ఎలాగైనా ఆపాలని అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, వెలుగు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని తెల్లవారు ఝామునే రెండు బస్సులను తగలబెట్టి పనిముగించుకున్నారు కొందరు ఆందోళనకారులు.  

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles