Political presidential election process in trs party

presidential election process in trs party, trs to elect a president, kcr, trs party, telangana rastra samithi, trs leaders, vijayasanthi,

presidential election process in trs party

మళ్లీ కేసీఆరే దళపతి!

Posted: 04/25/2013 10:35 AM IST
Political presidential election process in trs party

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా మరోసారి కె.చంద్రశేఖరరావు ఎన్నిక లాంఛనమే. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కేసీఆర్‌ తరఫున ఎంపీ విజయశాంతి, ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు ఈటెల రాజేందర్‌లు ప్రజా ప్రతినిధుల తరఫున నామినేషన్‌ను దాఖలు చేయగా పొలిట్‌బ్యూరో పక్షాన సీనియర్‌ నాయకుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుతోపాటు పలువురు సీనియర్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా కేసీఆర్‌ తరఫున తెలంగాణ భవన్‌లో ఎన్నికల అధికారి నాయిని నరసింహారెడ్డికి అందజేశారు.

నామినేషన్లు వేసేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలవరకు సమయం ఉంది. అయితే పార్టీ అనుబంధ సంఘాల తరఫున పలువురు కేసీఆర్‌ తరఫున నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ఈనెల 27న శనివారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో జరిగే పార్టీ వార్షిక ప్రతినిధుల సదస్సులో అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. కేసీఆర్‌ మినహా మరెవరూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాలు లేనందున ఆరోజు కేసీఆర్‌ ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక కానున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles