Justice j s verma died at gurgaon hospital

justice jc verma dead, nirbhay law, rape and violence against women, delhi gang rape, amendment in criminal law

justice j s verma died at gurgaon hospital

నిర్భయ నిర్మాత ఇకలేరు

Posted: 04/23/2013 09:57 AM IST
Justice j s verma died at gurgaon hospital

ఢిల్లీలో సామూహిక అత్యాచారం, మహిళ మీద హింసాత్మక చర్యలు వెలుగు చూసిన తర్వాత, మహిళా సంరక్షణ కోసం న్యాయపరంగా అభివృద్ధిని ఆశిస్తూ మార్పులు చేపట్టటానికి ఏర్పడ్డ కమిటీకి నేతృత్వం వహించిన మాజీ సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ జె.ఎస్.వర్మ నిన్న మృతి చెందారు.  ఆయన అత్యారాలకు ప్రస్తుతమనున్న ఏడు సంవత్సరాల జైలు శిక్షను 10 సంవత్సరాలకు పెంచవలసిందిగా సూచించారు. 

అత్యాచార చట్టాన్ని సవరించటం కోసం ఏర్పడ్డ ఆ కమిటీలో 80 సంవత్సరాల జె.ఎస్ వర్మతోపాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ జస్టిస్, జస్టిస్ లీలా సేఠ్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.  నెల రోజుల లోపులోనే అత్యాచార చట్ట సవరణల నివేదికను ఆ కమిటీ అత్యంత సమర్ధవంతంగా తయారుచేసింది. 

శుక్రవారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గుర్గావ్ సమీపంలోని మేదాంత మెడిసిటీ హాస్పిటల్ లో వైద్యచికిత్స కోసం చేర్చారు.  కానీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.  సోమవారం నాడు ఆయన హాస్పిటల్ లోనే తుది శ్వాసను వదిలారు. 

-శ్రీజ

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles