Protests at congress chief sonia gandhi residence over delhi rape

protests at sonia residence over delhi rap, president sonia gandhi, home minister sushilkumar, 5year girl raped, 5 years baby raped in delhi,, baby raped in delhi, sushil kumar shinde house,

protests at congress chief sonia gandhi residence over delhi rape

సోనియా ఇంటి ముట్టడికి యత్నం

Posted: 04/20/2013 07:15 PM IST
Protests at congress chief sonia gandhi residence over delhi rape

ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకుతోంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చిన్నారి అత్యాచార ఘటన ఢిల్లీని మరోసారి కుదిపేసింది. దీనిపై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఇంటిని ముట్టడించడానికి యత్నించారు. అయినప్పట్టికీ ఆయా చోట్ల మహిళలు, యువత తీవ్రంగా స్పదించారు. మహిళలపై అత్యాచారాల నిరోదానికి గాను చట్టాలు చేసి ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి షిండే ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున బలగాలను మొహరించారు. రాష్ట్రపతి, సోనియాగాంధీ తదితరులు కూడా ఈ ఘటనను ఖండించారు. ఈ కేసులో పోలీసులు చిన్నారి పాప తల్లితండ్రులను కేసు నమోదు చేయకుండా ఆరుగంటల సేపు ఉంచిన తీరు తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. సోనియాగాంధీ ఇంటిని ముట్టడించేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. బారికేడ్లను తొలగించి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారుల యత్నించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు పలుచోట్ల 144 సెక్షన్ అమలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles