Sriram shobha yatra at hyderabad

sriram shobha yatra at hyderabad, bharatiya janata party, rani avantibai hall, ram kothi hyderabad, bjp led shobhayatra successful, tight security for shobha yatra

sriram shobha yatra at hyderabad

శోభాయామనంగా శోభాయాత్ర

Posted: 04/20/2013 10:15 AM IST
Sriram shobha yatra at hyderabad

నిన్న శ్రీరామనవమి సందర్భంగా హైద్రాబాద్ లో శోభయమానంగా శోభాయాత్ర జరిగింది. అంతకంటే ముఖ్యం- శాంతియుతంగా పూర్తయింది.

రాణీ అవంతీ బాయి హాల్ నుంచి మధ్యాహ్నం ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 10 గంటలకు గమ్యమైన రామ్ కోఠి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంది. నిర్వాహకులు, కార్యకర్తలు, భక్తులు కాషాయరంగు వస్త్ర ధారణ, టోపీలు ధరించగా, దారిపొడవునా కాషాయరంగులతో నూ జై శ్రీరామ్ అంటూ నామోచ్ఛరణతోనూ నిండిపోయింది.

శోభాయాత్ర ధూల్ పేట్ నుంచి మంగళ్ ఘాట్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్, ఛత్రి, గౌలిగూడా ప్రాంతాల ద్వారా రామ్ కోఠికి పూర్తి భద్రతా ఏర్పాట్లతో చేరుకుంది. ఇంకా మరపుకురాని దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లతో పాటు నిన్న శుక్రవారం అవటం వలన మత విద్వేషాలు రెచ్చిపోయే అవకాశమున్న సున్నితమైన ప్రాంతలలోంచి ఊరేగింపుని పోలీసులు జాగ్రత్తగా దాటించారు.

వీడియో కవరేజ్ లు ఉన్నాయని తెలుస్తేనే చాలు నవ్వు ముఖాలు ఎలా పెడతారో అలాగే విద్వేషాలను రగిలించే భాషాప్రయోగాలు కూడా చెయ్యకుండా ఉంటారన్న సత్యాన్ని ఎరిగిన పోలీసు శాఖ, ఊరేగింపులో స్వామీజీలు, గురువులు, పీఠాధిపతులు, భాజపా నేతలు పాల్గొని ఉపన్యాసాల ఏర్పాట్లు కూడా ఉండటం వలన విద్వేషాలు రగిలించే అవకాశం లేకుండా సిసి కేమెరాల సాయంతో వీడియో ఫుటేజ్ ల ఏర్పాటు కూడా చేసారు.

అందరూ హాయిగా ఊపిరి పీల్చుకునేట్టుగా ఊరేగింపు శాంతియుతంగా జరిగి విజయవంతమైంది. అలా జరిగితేనే కదా పండుగ జరిగినట్టు

-శ్రీజ

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles