Bangalore blast made hyderabad alert

banagalore blast, hyderabad aler over blast, bangalore malleswaram, bjp office, 16 wounded in bangalore blast

bangalore blast made hyderabad alert

బెంగళూరు బ్లాస్ట్ తో హైద్రాబాద్ లో అలర్ట్

Posted: 04/18/2013 09:54 AM IST
Bangalore blast made hyderabad alert

బెంగళూరులో జరిగిన బాంబు పేలుళ్ళు ఇండియన్ ముజాహిదీన్ పనేనన్న అనుమానం నగరం లో భద్రతా సిబ్బందికి కునుకు లేకుండా చేసింది.  దొరికిన ఆధారాలనుబట్టి బెంగళూరులో భాజపా కార్యాలయం ముందు జరిగిన బాంబు పేలుళ్ళ వెనుక ఉగ్రవాద హస్తమున్నట్లుగా అనుమానాలు రేకెత్తించాయి. 

నిన్న బెంగళూరులో జరిగిన బాంబు పేలుళ్ళ దృష్ట్యా పోలీసులు హైద్రాబాద్ లో అలర్ట్ అయిన సందర్భంగా తనిఖీలను విస్తృతం చేసారు.  టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసు బలగాలు మిగతా వివిధ పోలీసు శాఖలనుంచి బృందాలు తనిఖీలను ముమ్మరంచేస్తూ నగర శివార్ల నుంచి నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల వరకు అన్ని ప్రదేశాలలో అప్రమత్తంగా ప్రవర్తించారు.  అనుమానం కలిగినప్పుడల్లా వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు.  షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళ దగ్గర ప్రత్యేక తనిఖీలు చేసారు.  చెనాయ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఎప్పటినుంచో పార్కింగ్ లో ఉన్న వివిధ వాహనాలను పరిశీలించారు. 

బాంబు ఎక్కువ శక్తివంతమైనది కాదుగాని, 16 మందిని గాయాలపాలు చేసింది.  అందులో 11 మంది పోలీసులున్నారు.  రద్దీగా ఉండే బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో జరిగిన ఈ బాంబు పేలుడు దర్యాప్తు బృందాలకు ఉగ్రవాద చర్యేనన్న అనుమానాలు కలిగిస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles