Sanjay dutt gets four more weeks time to surrender

sanjay dutt extension of time, supreme court of india, cbi, movies on sanjay dutt hand, mumbai blast case, possesion of arms

sanjay dutt gets four more weeks time to surrender

సంజయ్ దత్ కి మరో నాలుగువారాలపాటు స్వేచ్ఛావాయువులు

Posted: 04/17/2013 12:55 PM IST
Sanjay dutt gets four more weeks time to surrender

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రేపు జైలు శిక్ష అమలు కోసం అధికారులకు లొంగిపోవలసిన హిందీ నటుడు సంజయ్ దత్ కి మరో నాలుగు వారాల గడువు లభించింది.  తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు సంజయ్ దత్ ఆరు నెలల గడువుని కోరారు.  అయితే సుప్రీం కోర్టు ఆయనకి నాలుగు వారాల గడువు మాత్రమే ఇచ్చింది.  రేపటి నుంచి లెక్క చూసే ఈ గడువు ఆఖరిదని, మరోసారి గడువుని పొడిగించటమనేది ఉండదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

లొంగి పోవటానికి గడువు ఇవ్వటం అభ్యంతరకరమని సిబిఐ వాదించింది కానీ సుప్రీం కోర్టు దాన్ని తోసిపుచ్చింది.  ఆరు నెలల గడువు కోరటం ఏ న్యాయ నిర్దేశం కిందా కాదని కేవలం మానవత్వ కోణంలో ఇప్పించమని అర్థిస్తూ పిటిషన్ వేసామని సంజయ్ దత్ లాయర్ అన్నారు. 

ముంబై బ్లాస్ట్ కేసులో మారణాయుధాలు కలిగున్న నేరం మీద సంజయ్ దత్ కి మొదట్లో విధించిన 6 సంవత్సరాల శిక్షను 5 సంవత్సరాలకు కుదించగా, అందులోంచి ఇప్పటికే జైలు శిక్ష అనుభవించిన ఒకటిన్నర సంవత్సరాలు తీసివెయ్యగా సంజయ్ దత్ ఇంకా మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను అనుభవించవలసివుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles