Sharat kumar software engineer found in us

potharaju sharat kumar, tcs company, fd memorial, washington dc, chicago, sharat kumar body found

sharat kumar software engineer found in us

గుంటూరుకి చెందిన శరత్ కుమార్ ఆచూకీ

Posted: 04/13/2013 11:38 AM IST
Sharat kumar software engineer found in us

మార్చి 31 నుంచి అమెరికాలో కనిపించకుండా పోయిన టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న గుంటూరుకి చెందిన 35 సంవత్సరాల పోతరాజు వెంకట శరత్ కుమార్ ఆచూకీ తెలిసి, ఇంతకాలం ఆచూకీ తెలియనందుకు వేదనకు గురౌతున్న అతని తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చింది.  ఎఫ్ డి ఆర్ మెమోరియల్ సమీపంలో టైడల్ బేసిన్ దగ్గర గురువారం రాత్రి శరత్ మృతదేహం కనిపించింది. 

అమెరికాలో పోలీసులు చేపట్టిన దర్యాప్తును ఎప్పిటకప్పుడు గమనిస్తున్న అతని బంధువులు ఈ విషయాన్ని తెలియజేయటంతో శరత్ కుమార్ తల్లిదండ్రు దిగ్భ్రాంతికి గురయ్యారు.  నిజాన్ని అంగీకరించటానికి సిద్ధంగాలేని శరత్ తండ్రి వెంకట కృష్ణమూర్తి, తల్లి రాధలు పరామర్శించటానికి వస్తున్న ఫోన్ కాల్స్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో ఉండిపోయారు.  మార్చి 31 నుంచి ఏటి అగ్రహారంలోని వారి నివాసంలో కంటికి కునుకు లేకుండా పరితపించిన తల్లిదండ్రులు క్రమంగా చివరకు వాస్తవాన్ని గ్రహించే స్థితికి వచ్చారు. 

ఎక్కడున్నా శరత్ కుమార్ ప్రతిరోజు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుండేవారు.  మార్చి 31 నుంచి అలా ఫోన్ కాల్స్ రావటం మానెయ్యటంతో ప్రమాదాన్ని శంకించిన అతని తల్లిదండ్రులు వేదన చెందటం మొదలుపెట్టారు. 

వెంకట కృష్ణమూర్తి తన కుమారుడి గురించి చెప్తూ, అతను మొబైల్ టెస్టింగ్ టూల్స్ లో విశేష ప్రతిభను సంపాదించిన ఇంజినీరింగ్ బ్రిలియంట్ స్టూడెంటని, ఫ్రాన్స్ లోని గ్రెనోబుల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసాడని, వర్ల్ డ్ బ్యాంక్ లో అతనికి ఉద్యోగావకాశం వస్తున్న సమయంలోనే ఈ ఉపద్రవం ముంచుకొచ్చిందని అన్నారు. 

చికాగోలో పనిచేసే శరత్ కుమార్ కొద్దికాలంగా వాషింగ్టన్ డిసి లో ప్రాజెక్ట్ పని మీద ఉన్నారు.  అమెరికన్ పోలీసుల దర్యాప్తులో శరత్ కుమార్ మరణానికి కారణాలింకా బయటపడలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles