Women have excelled whenever given an opportunity narendra modi

delhi, ficci, ficci ladies, narendra modi, new delhi, rahul gandhi, women , narendra modi addresses ficci meeting, narendra modi, chief minister, gujarat,

women have excelled whenever given an opportunity: narendra modi

మహిళాశక్తి కీలకమైనది: మోడీ

Posted: 04/08/2013 01:30 PM IST
Women have excelled whenever given an opportunity narendra modi

ముఖ్యమంత్రికి మహిళలపై ఆసక్తి అంటే మరోలా  అనుకోండి?   మహిళల పట్ల భక్తి శ్రద్దలు కలిగిన ముఖ్యమంత్రి అని అర్థం. అయితే  ఈ ముఖ్యమంత్రికి ఇంకా పెళ్లి కాలేదనే,  ఆయన బ్రహ్మచారినే ఉన్నాడని ఆ రాష్ట్ర ప్రజలు  చెప్పుకుంటారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం  ఆయనకు పెళ్లి జరిగిందని, భార్యను వదిలిపెట్టాడనే పుకార్లు వినిపిస్తాయి. అయితే వీటిని ప్రక్కనపెడితే.. ఆ రాష్ట్రానికి  వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనదేనని  ప్రతిఒక్కరు చెబుతున్నారు.  ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పుడు రాజకీయ నాయకులకు  మోడల్ గా నిలుస్తున్నారు.  అయితే మహిళల పట్ల జరుగుతున్న వివక్షపై ఆయన స్పందించారు. ఆధునిక భారతదేశంలో మహిళాశక్తి కీలకమైనదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఫిక్కీ(ఎఫ్ఐసిసిఐ) మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని చెప్పారు. అమ్మ అనే పిలుపులో ఎంతో కమ్మదనం ఉందన్నారు. మహిళల పట్ల అభిప్రాయాలు మార్చుకోవాలన్నారు. ఆడ పిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారని బాధపడ్డారు. సోషల్ మీడియా వల్ల చాలామంది సోదరీమణులతో అభిప్రాయాలు పంచుకుంటున్నానని చెప్పారు. ఫేస్‑బుక్‑, ట్విట్టర్ల ద్వారా అభిప్రాయాలు తనతో పంచుకోవాలని కోరారు.  స్త్రీలకు సముచిత గౌరవం ఇవ్వవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అవకాశం కల్పిస్తే అభివృద్దిలో మహిళలే ముందుంటారన్నారు. గుజరాత్‑లో ఎక్కవ శాతం ఆస్తులు మహిళల పేరుమీదే ఉంటాయని చెప్పారు. వృద్ధాప్యంలో కొడుకు కంటే కూతురే  అసరాగా నిలుస్తుందని చెప్పారు.  ఆడపిల్లల సంఖ్య తగ్గుదలతో  దేశంలో  పురుషులకు పెళ్లిళ్లు కావడమే కష్టంగా మారిందని  నరేంద్ర మోడీ అన్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles