Amitabh magic works in govt programs too

amitabh bachan, gujarat tourism program, khushboo gujarat ki, gujarat tourism minister, gujarat tourism development

amitabh magic works in govt programs too

amitabh-ads-for-govt.png

Posted: 03/26/2013 04:10 PM IST
Amitabh magic works in govt programs too

amitabh-bachan

ప్రభుత్వవ్యాపార ప్రకటనల్లో కూడా మరులు గొల్పిన అమితాభ్ బచ్చన్ మంత్రం.

గుజరాత్ శాసన సభలో కాంగ్రెస్ శాసన సభ్యుడు  మోహన్ సింగ్ రాఠ్వా అడిగిన ప్రశ్నకు, 2011, 2012 సంవత్సరాలలో గుజరాత్ ప్రభుత్వం 71.62 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి సౌరభ్ పటేల్ సభలో సమాధానమిచ్చారు.  

విశేషమేమిటంటే, ఈ కార్యక్రమానికి అమితాభ్ ఒక్క పైసా కూడా తీసుకోలేదని మంత్రి చేప్పారు.  కానీ ఆయనకు చేసిన వసతులు, ఏర్పాట్లకు 97 లక్షలు మాత్రమే ఖర్చయిందట.  

గుజరాత్ ప్రభుత్వం చేసిన ఖుష్బూ గుజరాత్ కీ  అనే కార్యక్రమంలో అమితాభ్ బచ్చన్ నటించగా దానికి మంచి స్పందన లభించిందని, 2009-10 లో 1.70 కోట్ల పర్యాటకులు గుజరాత్ ని సందర్శించగా, తర్వాత సంవత్సరంలో 2.25 కోట్ల పర్యాటకులు సందర్శించారని, అదంతా అమితాభ్ బచ్చన్ చేసిన కాంపైన్ వలనేనని,  దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమానికి అంత మంచి స్పందన లభించటం వలనేనని సౌరభ్ పటేల్ అన్నారు. 

దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన అమితాభ్ బచ్చన్ వ్యాపార వాణిజ్యాలలోనే కాకుండా ఆవిధంగా ప్రజల ప్రయోజనార్ధం ప్రభుత్వ ప్రకటనల్లో పనిచేసిన ఉదంతాలు ఇంకా చాలా ఉన్నాయి.  

మన రాష్ట్రం తరఫునుంచి ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఈసారి అమితాభ్ బచ్చన్ ని ఎంపిక చెయ్యటం విశేషం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Impact of srilankan issue on sports
Gang rape in amritsar leaves doublts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles